Site icon NTV Telugu

Clash Between YCP and TDP Leaders: మాచర్లలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

Macharla

Macharla

Clash Between YCP and TDP Leaders: పలనాడు జిల్లాలోని మాచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరొకసారి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాచర్లలోని 28వ వార్డులో పార్టీ కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు కడుతున్నారు టీడీపీ నాయకులు. అదే సమయానికి వైసీపీ కూడా మరో కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు కడుతున్న నేపథ్యంలో రెండు వర్గాలు వాదన దిగాయి. దీంతో సమీపంలో ఉన్న టీడీపీ, వైసీపీ క్యాడర్ కూడా తోడవడంతో, ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు.

Exit mobile version