NTV Telugu Site icon

CAA: అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం.. నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం

Citizenship Amendment Act

Citizenship Amendment Act

CAA: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ నేటి నుంచి అమలులోకి రాబోతుందంటూ కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం 1955కి 2019లో కేంద్రం సవరణ చేసిన సంగతి తెలిసిందే. 2016లో పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. 2019లో ఆమోదం పొందిన బిల్లుకు.. ఇప్పటివరకు కేంద్రం నిబంధనలను ప్రకటించలేదు. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో సీఏఏను ప్రతిపాదించింది. 2019లో కేంద్రం చట్టం చేసింది.. ఇప్పుడు అమలు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం.

Read Also: Big Breaking: కేంద్రం సంచలన నిర్ణయం.. సీఏఏ చట్టం అమలుకు నేడే నోటిఫినేషన్‌!

లోక్‌సభ ఎన్నికల ముందే ఈ చట్టం తీసుకొస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ విభజన జరిగినప్పుడు పొరుగు దేశంలో వేధింపులకు గురవుతున్న మైనారిటీల కోసం కాంగ్రెస్ పార్టీ పౌరసత్వం కల్పిస్తామన్న వాగ్దానం చేసింది.. కానీ అమలు చేయలేదు, చట్టం తీసుకురాలేదని ఆయన అన్నారు. ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్‌లలో హింసకు గురై మన దేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం మంజూరు చేయడానికి ఉద్దేశించిన చట్టమే పౌరసత్వ సవరణ చట్టం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టం అనుమతించినుంది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు మూడు దేశాల నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు బౌద్ధులు, పార్శీలకు ఈ పౌరసత్వ సవరణ చట్టం వర్తించనుంది.

 

Show comments