రోజురోజుకు జంక్ ఫుడ్ యొక్క పెరుగుతున్న వినియోగం, సాధారణ వ్యాయామం లేకపోవడంతో ప్రజలలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలలో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది. ఈ ధోరణి పెరుగుతున్న ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికల తక్షణ అవసరాన్ని తెలియచేస్తుంది. ఇక విద్య నిపుణులు, డైటీషియన్ ప్రకారం.. మీ ఆహారంలో నిర్దిష్ట ఆహారాలను చేర్చడం వల్ల శరీరంలో సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
Vitamin B12: విటమిన్ B12 లోపంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
విన్నిపెగ్ లోని మానిటోబా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు ఒక నెల వ్యవధిలో కొన్ని ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే., వారి కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని తేల్చింది. ఇందులో మొట్టమొదటగా సిఫార్సు చేయబడిన ఆహారం ఆమ్లా (ఉసిరి). ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం., ఉసిరి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇక మరొక ప్రయోజనకరమైన ఆహారం గ్రీన్ టీ. గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
Bay Leaf Water: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో బే లీఫ్ వాటర్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..
కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడటానికి నిమ్మకాయలు, ఇతర సిట్రస్ పండ్లను కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇక ఆకుకూర బచ్చలికూరలో ఉండే కెరోటినాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే కొన్ని అధ్యయనల ప్రకారం., వాల్‌నట్‌లు బరువు, ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతమైనవిగా పనిచేస్తాయి.