NTV Telugu Site icon

Karnataka: తల్లి ఫిర్యాదును నిరాకరించిన పోలీసులు.. తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టిన కొడుకు

Karnataka

Karnataka

ఫిర్యాదు చేసేందుకు వస్తే.. పోలీసులు నిరాకరించారని ఓ వ్యక్తి కోపంతో రగిలిపోయి తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రాగా.. ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలో.. మనస్తాపం చెందిన ఆ మహిళ కొడుకు ప్రభుత్వ వాహనానికి నిప్పుపెట్టాడు. నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తించారు. చల్లకెరె తహసీల్దార్ కార్యాలయంలో లోపల వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అది గమనించిన కార్యాలయ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు.

Gurugram: గురుగ్రామ్‌ను ముంచెత్తిన వరద.. నీట మునిగిన ఖరీదైన భవనాలు

అనంతరం.. నిందితుడు పృథ్వీరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాన్ని ధ్వంసం చేయడం.. అధికారిక విధులకు ఆటంకం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కూడా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)కి వినతిపత్రం సమర్పించారు.

Jaggery Ganapati: గాజువాకలో 70 అడుగుల గణపతి.. 18 టన్నుల బెల్లంతో..

అయితే.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న పృథ్వీరాజ్.. జులైలో విహారయాత్రకు వెళ్లి కొన్ని రోజులు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో.. తన కొడుకు తన వద్దకు చేరుకోకపోవడంతో తల్లి చల్లకెరె పోలీస్ స్టేషన్‌లో జూలై 2న ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అయితే.. పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకునేందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో.. నిందితుడు పృథ్వీరాజ్‌, జులై 23న పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో.. అతడిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో.. తహసీల్దార్ సమక్షంలో మరోసారి ఇలా చేయబోమని నిందితుడు చెప్పాడు. అనంతరం.. ఆవేశంతో తన తల్లి ఫిర్యాదును పట్టించుకోని చల్లకెరె పోలీసులపై డిఆర్‌డిఓ, విధానసౌధ సహా ప్రభుత్వ భవనాలను పేల్చివేస్తానని నిందితుడు సోషల్ మీడియాలో బెదిరించాడు. ఈ క్రమంలో.. నిందితుడి తల్లి ఫిర్యాదును నమోదు చేయని చల్లకెరె స్టేషన్‌లోని ఏఎస్‌ఐని అధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా.. తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని వాహనానికి నిప్పు పెట్టాడు.