Megastar Chiranjeevi: మెగాస్టార్ ఖాతాలో మరో అవార్డ్.. అగ్ర నటుడికి అత్యున్నత గౌరవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megastar Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ప్రతిష్టాత్మకంగా “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” (Gaddar Film Awards) ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 ఏడాదికి సంబంధించి ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేసింది. భారతీయ సినిమా అభివృద్ధికి విశేషంగా సేవలు అందించిన మహానుభావులకు ఇచ్చే ఈ గౌరవం చిరంజీవికి దక్కడం సినీ ప్రపంచంలో నూతన ఉత్సాహాన్ని తెచ్చింది.
READ MORE: Earthquake: ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్.. ఇరాన్‌లో భూకంపం.. 4.1గా నమోదు
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ చిర స్థాయిగా నిలిచిపోయారు. తెలుగు రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేశారు. అలాంటి గొప్పి వ్యక్తి అయిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారకంగా అందజేసే ఈ గౌరవం దేశవ్యాప్తంగా చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలు చేసిన కళాకారులకు ఇస్తారు. అలాంటి ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని చిరంజీవి అందుకోవడం దశాబ్దాల ప్రయాణానికి వచ్చిన గొప్ప గుర్తింపుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. చిరంజీవి తన కెరీర్‌లో చాలా రకాల పాత్రలు పోషించారు. కింది స్థాయి నుంచి వచ్చిన ఆయన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి సినీ ఇండస్ట్రీలో నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. కోట్లాది జనాల ఆదరణ పొందారు. ఈ తరుణంలో చిరంజీవికి వరుసగా గౌరవాలు లభిస్తున్నాయి. గతేడాది దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్ లభించింది. అదే సమయంలో తన నటనా జీవితంలో సాధించిన విశేష విజయాలకుగాను గిన్నిస్ ప్రపంచ రికార్డుల నుంచీ గుర్తింపు లభించింది. ఈ రెండు గౌరవాల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం రావడం చిరంజీవి కెరీర్‌లో మరొక గొప్ప ఘట్టంగా మారింది. చిరంజీవి సినీ ప్రయాణం కొత్త తరానికి కూడా ప్రేరణగా నిలుస్తోంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని శ్రమతో ఎదిగిన చిరూ కథ ఎంతోమంది యువ నటులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక ఇటీవల నటించిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ప్రాంతీయ స్థాయిలో మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. దర్శకుడు బాబీతో కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు భారీ కల్పిత కథతో తెరకెక్కుతున్న విశ్వంభర విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ అవార్డు ప్రకటన విశేషంగా నిలిచింది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!