Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Mokshagna Debut: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య నటవారసుడికి సంబంధించిన ఒక క్రేజీ వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో తెగ హల్చల్ చేస్తోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న మోక్షజ్ఞ .. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం బయటికి రావడంతో #Mokshagna, #NBKFilms, #BoyapatiSrinu అనే ట్యాగ్స్‌తో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
నిజానికి మోక్షజ్ఞ తన మొదటి సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ‘సినిమాటిక్ యూనివర్స్’ బ్యాక్‌డ్రాప్‌లో చేయాల్సి ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే సమయంలో మోక్షజ్ఞ వెండి తెర ఎంట్రీ కోసం బాలకృష్ణ పక్కా స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ లాంటి ఇండస్ట్రీ హిట్లను ఇచ్చిన బోయపాటి శ్రీను అయితేనే.. మోక్షజ్ఞను మాస్ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేయగలరని నందమూరి కాంపౌండ్ భావిస్తోందట. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమాను లైన్లో పెట్టి దానిని బాలకృష్ణ తన సొంత నిర్మాణ సంస్థ ‘NBK ఫిలిమ్స్’ బ్యానర్‌పైనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్లు టాక్. మోక్షజ్ఞ కోసం ఇప్పటికే బోయపాటి శ్రీను ఒక పవర్ఫుల్ మాస్ స్క్రిప్ట్ రెడీ చేసి బాలయ్యను ఒప్పించారని, ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఈ కాంబినేషన్ అధికారికంగా ఖరారైతే గనుక బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలైనట్టే అని నందమూరి ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రేజీ అప్డేట్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?