నేడు(మే 12 ) “మథర్స్ డే”…జన్మనిచ్చిన మాతృమూర్తిని నేడు అందరూ స్మరించుకుంటున్నారు.ఎంతటి గొప్ప వ్యక్తి అయిన కూడా అమ్మ చాటు బిడ్డే.చిన్నప్పుడు అమ్మ ఒడిలో ఆడుకుంటూ చేసే అల్లరి ఎప్పటికి మర్చిపోలేము.అల్లరి చేస్తే అమ్మ కొట్టే చెంప దెబ్బ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది.ఈ సృష్టిలో ఏ స్వార్ధం లేకుండా మనపై ప్రేమ చూపించేది అమ్మ మాత్రమే.వేదకాలం నుంచే తల్లిని దైవంలా భావించి ఆరాధిస్తున్నాము.నేడు మాతృదినోత్సవం సందర్భంగా సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం తమ మాతృమూర్తులను తలుచుకుని వారితో గడిపిన మధురమైన జ్ఞాపకాలను స్మరించుకుంటున్నారు.
అమ్మతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనా దేవితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసారు.జన్మనిచ్చి ,పెంచి పోషించిన అమ్మకి ఈ ఒక్కరోజు ఏంటి.. ప్రతిరోజు అమ్మదే..ఈ జీవితమే అమ్మది..అమ్మ లేని జీవితం ఊహించుకోలేము.హ్యాపీ మథర్స్ డే అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు …ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మెగాస్టార్ తో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా తమ అమ్మతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
జన్మనిచ్చి, పెంచి, పోషించిన అమ్మ కి
ఈ ఒక రోజు ఏంటి .. ప్రతి రోజు అమ్మ దే.. ఈ జీవితమే అమ్మది.
Happy Mother’s Day ! 🙏🙏 pic.twitter.com/wo68QAdiAq— Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2024