మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఈ సినిమాలో చిరు యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. రోజూ ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది..
భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా రూపోందుతుంది.. ప్రస్తుతం హైదరాబాద్ ముచ్చింతల్ లో వేసిన ఆంజినేయ స్వామి విగ్రహం సెట్ వద్ద యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు.. అక్కడ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఇటీవల ఓ ఈవెంట్ కు హాజరైన చిరంజీవి ఈ సినిమా గురించి ఓ విషయాన్ని బయటపెట్టాడు.. అదేంటంటే విశ్వంభర షూటింగ్ లో యాక్షన్ సీన్ చేయడానికి నా డూప్ ని తీసుకొచ్చారు. నేను ఎందుకు అంటే భారీ యాక్షన్ సీన్ చెప్పారు. ఆ సీన్ విన్న తర్వాత పర్లేదు డూప్ వద్దు నేను చేసేస్తానని చెప్పాను..
కానీ డైరెక్టర్ వాళ్లు ఎందుకు రిస్క్ వద్దన్నా వినలేదు.. ఫ్యాన్స్ కోసం కష్టమైన భరించాలి.. నాలో ఇంకా ఆ శక్తి ఉంది అని చిరు చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. ఈ వయసులో అభిమానుల కోసం సినిమాలు తీయడమే గ్రేట్ అంటే అందులో యాక్షన్ సీన్స్ కూడా చెయ్యడం మామూలు విషయం కాదని అభిమానులు అభినందిస్తున్నారు..