Site icon NTV Telugu

Chinta Mohan: చంద్రబాబు 49 ఏళ్లుగా నాకు తెలుసు.. చాలా భయస్తుడు..!

Chinta Mohan

Chinta Mohan

Chinta Mohan: 49 ఏళ్లుగా చంద్రబాబు నాకు తెలుసు.. చంద్రబాబు చాలా భయస్తుడని వ్యాఖ్యానించారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతామోహన్.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సొంత తమ్ముడుకి మేలు చేసినా జనాలు ఏమి అనుకుంటారో అని సహాయం చేయకుండా ఉండే వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. కానీ, వ్యక్తిగత కక్ష రాజకీయాలు మంచి కాదని హితవుపలికారు.. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఎంతో కలిసి మెలసి ఉండేవారు.. అనుభవం లేకపోవడం వల్ల వైఎస్‌ జగన్ ఇలాంటి చర్యలు తీసుకున్నారని.. వైసీపీ తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకే అనుకూలంగా మారిందన్నారు.

Read Also: CSL Apprentice Recruitment : కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు..

ఇక, అసెంబ్లీలో స్పీకర్ పైనా ఎమ్మెల్యేలకు నమ్మకం లేదన్నారు చింతా మోహన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు జైల్లో.. వైఎస్‌ జగన్ బెయిల్ పై ఉన్నారన్న ఆయన.. మహిళ రిజర్వేషన్ పై బీజేపీ చేస్తున్నది మ్యాజిక్.. నమ్మడానికి ఏమీ లేదన్నారు.. ఇది కేవలం ఎన్నికల స్టంట్‌గానే కొట్టిపారేశారు. మహిళ రిజర్వేషన్ టీటీడీలో.. సుప్రీంకోర్టు జిడ్జి నియామకాల్లో.. ఐఏఎస్‌లలో వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేవారు. మరోవైపు.. 17 వేల కోట్ల రూపాయల టీటీడీ నిధులు, బంగారం నిల్వలు ఎక్కడ పోయాయో టీడీపీ అధికారులు చెప్పాలని డిమాండ్‌ చేశారు.. 17 వేల కోట్లును వడ్డీ కోసం ఇచ్చామంటున్నారు.. అది ఎక్కడ ఇచ్చారంటే మాత్రం టీటీడీ నుంచి సమాధానం లేదంటూ దుయ్యబట్టారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌.

Exit mobile version