Chinta Mohan: అమరావతి రాజధాని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇష్టంలేదు.. తిరుపతిని ఏపీ రాజధాని చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఇష్టపడటం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు లోలోపల అమరావతిని “చంద్రావతి” అని పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు తిరుపతిని రాజధానిగా చేస్తే అన్ని ప్రాంతాల ప్రజలు అంగీకరిస్తారని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. రాజధానికి వెయ్యి ఎకరాల భూమి సరిపోతుందని, రాజధాని అంటే ప్రభుత్వ భవనాలు తప్ప మరేమీ ఉండవని అన్నారు. ఈ రోజుల్లో పరిపాలన అంతా డిజిటల్ విధానాల్లో జరుగుతోందని చెబుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో రాజధాని నిర్మాణం ఎందుకు అవసరమని ప్రశ్నించారు. లక్ష ఎకరాల భూమితో రాజధాని నిర్మాణం చేయడం వల్ల రాష్ట్రానికి అప్పులు, నష్టాలే తప్ప లాభం ఉండదన్నారు. అందుకే తిరుపతిని ఏపీ రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక రాష్ట్రంలోని సహజ వనరుల వినియోగంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు చింతామోహన.. చంద్రబాబు ప్రభుత్వం సహజ వనరులను దోపిడి చేస్తోందని ఆరోపించారు. వందల కోట్ల రూపాయల విలువైన వనరులు అక్రమంగా తరలిపోతున్నాయని, సత్యవేడులో వేలాది టిప్పర్లతో ఇసుక దోపిడీ జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు సిలికా, క్వార్ట్జ్ ఖనిజాలు భారీ ఎత్తున తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
- VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
డీలిమిటేషన్ వల్ల ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య అసమానతలు
దేశ రాజకీయ వ్యవస్థపై ప్రభావం చూపే డీలిమిటేషన్ అంశంపైనా చింతా మోహన్ స్పందించారు. డీలిమిటేషన్ వల్ల ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల ప్రజాప్రాతినిధ్యంలో తీవ్ర అసమానతలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఉత్తర భారతానికి 600 సీట్లు వస్తే, దక్షిణ భారతానికి కేవలం 200 సీట్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దేశంలో ప్రాంతీయ అసమతుల్యత పెరిగే ప్రమాదం ఉందని, ఇది చాలా సున్నితమైన సమస్య అని హెచ్చరించారు. భారత్ కూడా ఒకప్పుడు Division of Germany లాగా విభజన భావజాలానికి లోనయ్యే అవకాశం ఉందని అన్నారు. మహిళా రిజర్వేషన్ వరకు పరిమితమైతే సరిపోతుందని, డీలిమిటేషన్ పెంపుపై తొందరపడవద్దని కేంద్ర ప్రభుత్వానికి సున్నితంగా హెచ్చరిస్తున్నానని డా. చింతా మోహన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?