OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- చిన్న శ్రీను చేరికపై అసహనంగా అశోక్ గజపతి వర్గం?..
- గతంలో విజయసాయితో కలిసి తనను ఇబ్బంది పెట్టారన్న కోపం..
- అప్పట్లో మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం టెంపుల్ బోర్డ్‌లో సమస్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీలో కొత్తగా చేరిన చిన్న శ్రీను సడన్‌గా గోవా టూర్ ఎందుకు పెట్టుకున్నారు? అక్కడ గవర్నర్ అశోక్‌గజపతి రాజుతో ప్రత్యేకంగా ఎందుకు భేటీ అయ్యారు? ఇద్దరి మధ్య ప్యాచ్‌వర్క్ మొదలైందా? గతం చేసిన గాయాలను గోవాలో ఇచ్చిన పూల బొకేలు మార్చేస్తాయా? ఆ విషయంలో అశోక్ అనుచరులు ఏమంటున్నారు? రివెంజ్ కథ కంచికి చేరినట్టేనా? లేక కొత్త మలుపులు ఉంటాయా? లెట్స్ వాచ్.
విజయనగరం జిల్లా ముఖ్య నేతల్లో ఒకరైన చిన్న శ్రీను వైసీపీ నుంచి టీడీపీలోకి ఎంటరైపోయారు. కానీ… ఈ ఎంట్రీతో లోకల్‌గా తెలుగు తమ్ముళ్లంతా హ్యాపీగా ఉన్నారా అంటే… ఠక్కున ఎస్ అని చెప్పలేకపోతున్నాయి ఆ పార్టీ వర్గాలు. దీనికి సంబంధించి ఇప్పుడు జిల్లాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు వర్గం ఈ విషయంలో అసహనంగా ఉందని చెప్పుకుంటున్నారు. చిన్న శ్రీను గతంలో వైసీపీలో ఉన్నప్పుడు నాటి పార్టీ నేత విజయసాయిరెడ్డితో కలిసి అశోక్‌ను ఇబ్బంది పెట్టారన్న డిస్కషన్ తెర మీదికి వచ్చింది.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
ఆ పాత వ్యవహారాలను అశోక్ వర్గం ఇప్పుడు గుర్తు చేసుకుంటోందట. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి సింహాచలం దేవస్థానం బోర్డు నియామకాల వరకు.. అనేక వ్యవహారాల్లో ఇప్పట్లో అశోక్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయని అంటున్నారు ఆయన సన్నిహితులు. అప్పట్లో ట్రస్టుల్లో అనువంశిక ధర్మకర్త అయిన అశోక్ గజపతి రాజుని తప్పించి… సంచయిత గజపతిని రంగంలోకి దింపడం తీవ్ర వివాదాస్పదమైంది. దానికి సంబంధించి అశోక్ న్యాయ పోరాటం చేశారు కూడా. అలాగే… రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసినప్పుడు కొత్త విగ్రహాల కోసం తాను పంపిన విరాళాన్ని తిరస్కరించడం లాంటి పరిణామాలలో చిన్న శ్రీను పాత్రపై అశోక్‌గజపతి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్నది లోకల్ టాక్.
అంతేకాదు.. విజయనగరంలో నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు బంగ్లా గేటుకు తాళాలు వేయించిన వ్యవహారం.. చివరకు వైసీపీ పార్టీ కార్యాలయానికి సంబంధించిన పరిణామాల్లో సైతం చిన్న శ్రీను నుంచే ఇబ్బందులు వచ్చాయంటూ గోవా గవర్నర్ గుర్తు చేసుకుంటున్నారట. అందుకే… వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే… చిన్న శ్రీను ప్యాచ్‌వర్క్ మొదలుపెట్టారన్నది లేటెస్ట్ టాక్. తన కుమార్తెతో కలిసి, అశోక్ కుమార్తె, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మిని వెంటబెట్టుకుని గోవా వెళ్లడం కూడా ఇందులో భాగమేనని చెప్పుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిన్న శ్రీను.. విజయసాయిరెడ్డితో కలిసి తనను బాగా ఇబ్బందిపెట్టారన్న భావన అశోక్‌లో బలంగా ఉందని అంటున్నారు. మాస్సాస్ ఛైర్మన్, సింహాచలం ట్రస్ట్ బోర్డు నియామకాల్లాంటి వ్యవహారాల్లో రాజుగారు బాగా హర్ట్ అయ్యారని చెబుతున్నారు ఆయన సన్నిహితులు.
విజయనగరంలో రాజకీయంగా కీలకమైన సమయంలో బంగ్లా గేటుకు తాళాలు వేయించిన వ్యవహారం కూడా ఇప్పుడు మరోసారి చర్చకు వస్తోంది. చివరకు స్థానిక వైసీపీ కార్యాలయానికి సంబంధించిన వ్యవహారంలోనూ చిన్న శ్రీను కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయని టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో… చిన్న శ్రీను.. అదితిని వెంటబెట్టుకుని గోవా వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఆయనకు టీడీపీలో ఏ పదవి.. ఎలాంటి బాధ్యతలకు హామీ ఇచ్చారన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు.
ప్రస్తుతానికి పార్టీలో చేరి పని చేయాలని మాత్రమే సూచించారన్నది జిల్లా టీడీపీలో వినిపిస్తున్న మాట. ఇక్కడే అసలు అసంతృప్తి మొదలవుతోందన్నది మరో వాదన. నాడు తనను ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తినే ఇప్పుడు పార్టీలోకి తీసుకుంటే.. గతాన్ని పూర్తిగా పక్కన పెట్టేయగలమా అన్నది అశోక్ అభిప్రాయంగా తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరన్నది నిజమేగానీ…. గత పరిణామాల తాలూకు ప్రభావం వెంటనే పోతుందా అంటూ ఇప్పుడు విజయనగరంలో మాట్లాడుకుంటున్నారు. చిన్న శ్రీను ఎంట్రీతో లోకల్ వైసీపీ లెక్కలు ఎలా మారతాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.
తాజావార్తలు
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?