Chinmayi-Shivaji : క్షమాపణలు చెబితే సరిపోదు.. శివాజీ పై మరోసారి విరుచుకుపడ్డ చిన్మయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దండోరా’ సినిమా ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద చిచ్చు రేపాయి. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అవ్వడం, శివాజీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా ఈ అంశంపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. లూలూ మాల్లో వేధింపులకు గురైన నటినే తప్పుబట్టడం అత్యంత దిగ్భ్రాంతికరమని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి దుస్తులను సాకుగా చూపిస్తూ నేరస్తుల ప్రవర్తనను సమర్థించడం, సమాజంలో పాతుకుపోయిన స్త్రీ ద్వేషానికి నిదర్శనమని చిన్మయి మండిపడ్డారు. అంతే కాదు..
Also Read : Allu Arjun-Lokesh : లోకేశ్‌తో బన్నీసీక్రెట్ మీటింగ్.. మూవీ ఫిక్స్ అవుతుందా?
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
శివాజీ వివరణ ఇస్తున్న కొద్దీ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ లేని వాతావరణం ఉందనే విషయం మరింత స్పష్టమవుతోందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు పురుషుల ప్రవర్తనే కారణమని అంగీకరించకుండా, మహిళల ప్రవర్తనను వేలెత్తి చూపడం నేరాన్ని ప్రోత్సహించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి బాధ్యతారహితమైన మాటల వల్లే బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోవడానికి భయపడుతున్నారని, ఇది కేవలం ఒక్క నటికే కాకుండా మొత్తం మహిళా వర్గానికే అవమానమని ఆమె తన పోస్ట్‌లో స్పష్టం చేశారు. చూడబోతే.. ఈ విషయం ఇప్పట్లో ముగిసేలా లేదు.
తాజావార్తలు
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!