‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద చిచ్చు రేపాయి. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అవ్వడం, శివాజీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా ఈ అంశంపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. లూలూ మాల్‌లో వేధింపులకు గురైన నటినే తప్పుబట్టడం అత్యంత దిగ్భ్రాంతికరమని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి దుస్తులను సాకుగా చూపిస్తూ నేరస్తుల ప్రవర్తనను…