Corona Deaths: చైనాలో చిన్నారుల ప్రాణాలు తీస్తున్న లాక్ డౌన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona Deaths: చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షాలను కఠినతరం చేసింది. ఒక్కకేసు వచ్చినా ఆ ప్రాంతాన్ని కట్టడి చేస్తోంది. కరోనా లక్షణం అనిపిస్తే ఏ ఒక్కరినీ బయట తిరగనీయకుండా క్వారంటైన్ చేస్తుంది. జీరో కొవిడ్ విధానాన్ని అనుసరిస్తున్న చైనా లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనూ దేశ పౌరులను బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. దీంతో క్వారంటైన్లో ఉన్న చిన్నారులకు అత్యవసర సమయంలో చికిత్స అందకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం మరీ కఠినంగా వ్యవహరిస్తుండడంపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై తిరగబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కరోనా మహమ్మారి ఝేంగ్‌జువా నగరంలో ఇటీవల వ్యాప్తి చెందుతుండడంతో లక్షలాదిమంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
Read Also: Gold Rate Today: రాకెట్లా దూసుకెళ్లిన బంగారం ధర.. ఏకంగా 7నెలల గరిష్టానికి పెంపు
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
కరోనా లక్షణాలు బయటపడితే వారిని నగరానికి దూరంగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో నగరానికి దూరంగా ఓ హోటల్లో క్వారంటైన్లో గడుపుతున్న ఓ కుటుంబంలోని చిన్నారి అస్వస్థతకు గురైంది. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో అత్యవసర వైద్య చికిత్స కోసం ప్రయత్నించారు. కరోనా ఆంక్షలని చెప్పి ఆ చిన్నారిని చికిత్స చేయించుకునేందుకు కూడా అధికారులు అంగీకరించలేదు. దీంతో పాప పరిస్థితి మరింత విషమంగా మారింది. దాదాపు 11 గంటలపాటు ప్రాధేయపడిన తర్వాత 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి పాపను తీసుకెళ్లేందుకు అధికారులు ఆ కుటుంబానికి అనుమతిచ్చారు. కానీ చిన్నారి అప్పటికే చనిపోయింది. ఇలాంటి ఘటన లాంఝువాలో జరిగింది. క్వారంటైన్లో ఉన్న మూడేళ్ల చిన్నారి అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. దీంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. అధికారుల తీరును నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి బారికేడ్లను తొలగించారు. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో స్పందించిన అధికారులు క్వారంటైన్లో ఉన్న వారికి అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలిగించబోమని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!