China’s Spy Ship: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు.. భారత్ సమీపంలో చైనా గూఢచారి నౌక..
- భారత జలాల దగ్గరకు చైనా గూఢచారి నౌక
- ఈ ఓడ పేరు డా యాంగ్ యి హావో
- ఈ నౌక కార్యకలాపాలపై అనుమానాలు
- ఇది సముద్ర సర్వే నౌక అని చెబుతున్న చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా తన గూఢచారి నౌకను భారత జలాల దగ్గరగా పంపింది. ఈ ఓడ పేరు డా యాంగ్ యి హావో. దాని కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ.. చైనా దీనిని సముద్ర సర్వే నౌక అని చెబుతోంది. ఈ నౌక కదలికలపై అమెరికాతో సహా అనేక దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. సర్వే నౌకల సహాయంతో చైనా శత్రు దేశాలపై గూఢచర్యం చేస్తుందని స్పష్టంగా చెబుతున్నాయి. పాకిస్థాన్‌తో ఉద్రిక్తత మధ్య చైనా గూఢచారి నౌక భారత సముద్ర సరిహద్దుకు దగ్గరగా రావడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
READ MORE: Minister Dola Bala Veeranjaneya Swamy: దివ్యాంగులపై సర్కార్ కీలక నిర్ణయం..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) ప్రకారం.. చైనా భూగర్భ శాస్త్రం, భౌగోళిక భౌతిక సర్వే నౌక డా యాంగ్ యి హావో – సముద్రగర్భాన్ని మ్యాప్ చేయగలదు. సబ్మెర్సిబుల్ను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. తాజాగా ఈ నౌక హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆ నౌక మే 12-13 తేదీల మధ్య అండమాన్, నికోబార్ దీవులను దాటి హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చేరుకుంది. మే 14న, ఇది భారతదేశానికి ఆగ్నేయంగా హిందూ మహాసముద్రంలో కనిపించింది. అప్పటి నుండి ఓడ దాని ట్రాన్స్‌పాండర్‌ను ఆపివేయడం వలన దాని స్థానాన్ని ట్రాక్ చేయడం కష్టమైంది.
READ MORE: Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు ఉచితంగా ఫ్రాడ్ డిటెక్షన్ సదుపాయం..
పాకిస్థాన్‌కు చైనా ఎలా సహాయం చేయగలదు?
చైనా తన గూఢచారి నౌకల సహాయంతో భారత జలాల్లో జలాంతర్గాముల కార్యకలాపాలను ట్రాక్ చేయగలదు. ఆ గూఢచారి నౌకకు ఉన్న అధునాతన సెన్సర్లతో ఐఎన్ఎస్ విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల కదలికలను పసిగట్టేందుకు వీలుంది. పాక్‌కు తమ మద్దతు ఉందని సంకేతాలు పంపేందుకు, నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ఈ మోహరింపు ఉపయోగించుకొని ఉండొచ్చని అనుమానాలు. ఒకవేళ పాకిస్థాన్‌లోని కరాచీపై భారత్ దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తే, వాటిని ముందుగానే పసిగట్టి, సదరు సమాచారాన్ని పాకిస్థాన్‌కు తెలియజేసేలా ఈ మోహరింపు ఉండి ఉండొచ్చు.
చైనా ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) కింద చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా సీపెక్ ప్రాజెక్టు చేపట్టడంపై భారత్ మొదట్నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే పాక్‌లో రాజకీయంగా, ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు ఉండటం డ్రాగన్‌కు అత్యంత కీలకం. అది కూడా నిఘా వెనక కారణం కావొచ్చు. భారతదేశంపై నిఘా ఉంచడంలో పాకిస్తాన్ నావికాదళానికి సహాయపడుతుంది. ఈ నౌక భారత నావికా దళాల మధ్య కమ్యూనికేషన్లను అడ్డుకోగలదు. భారతీయ కార్యాచరణ ప్రోటోకాల్‌లు, సంక్షోభ ప్రతిస్పందనలపై సమాచారాన్ని అందిస్తుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..