China Minister Li Shangfu Missing: డ్రాగన్ కంట్రీలో హై ప్రొఫెల్ వ్యక్తులు మిస్సవుతున్నారు. గతంలో విదేశాంగ మంత్రి చిన్‌గాంగ్ మిస్సవగా తాజాగా ఏకంగా రక్షణ శాఖ మంత్రి కనిపించకుండా పోయారు. రెండు వారాల క్రితం బీజింగ్‌లో జరిగిన చైనా-ఆఫ్రికా పీస్ అండ్ సెక్యూరిటీ ఫోరంలో మాట్లాడిన తర్వాత ఆయన ఏ బహిరంగ కార్యక్రమంలోనూ కనిపించలేదు. దీంతో ఆయన మిస్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని జపాన్ లోని యునైటెడ్ స్టేట్స్ రాయబారి కూడా ట్వీట్ చేశారు.
Also Read:Matsya 6000: సముద్రయాన్..మరో ఘనత సాధించడానికి సిద్ధమవుతున్న భారత్
మిగతా వారిలా కాకుండా ప్రస్తుతం కనిపించకుండా పోయిన చైనా మంత్రి సైన్యం నుంచి నియమితులయ్యారు. లీ షాంగ్‌ఫు వృత్తిరీత్యా ఏరోస్పేస్ ఇంజినీర్. ఆయన చైనా ఉపగ్రహ కార్యక్రమాల్లో పని చేశారు. చైనా స్పేస్, సైబర్‌వార్ ఫేర్ సామర్థ్యాన్ని అభివృద్ధిని వేగవంతం చేయడంలో కృషి చేశారు.గతేడాది అక్టోబర్‌లో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌లో సెంటర్ మిలటరీ కమిషన్ నుంచి వైదొలిగిన వీ ఫెంఘే స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఆయన తండ్రి లీషావోజు 1930-40లలో జపనీస్ వ్యతిరేక ఉద్యమంలో పోరాడిన రెడ్ ఆర్మీలో సభ్యుడు. అంతర్యుద్ధం, కొరియా యుద్ధం సమయంలో లాజిస్టికల్ రైల్వేలను పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. హార్డ్‌వేర్ ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ జరుపుతోన్న సమయంలో ప్రస్తుత పరిణామం చోటుచేసుకుంది. చివరిసారిగా చైనా-ఆఫ్రికా పీస్ అండ్ సెక్యూరిటీ ఫోరంలో మాట్లాడిన తర్వాత ఆయన ఎక్కడా కనిపించడంలేదు. అంతే కాదు కేవలం లీ షాంగ్‌ఫు కనిపించకుండా పోవడమే కాకుండా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో రాకెట్ ఫోర్స్ కు చెందిన ఇద్దరు కమాండర్లు కూడా అడ్రస్ లేకుండా పోయారు. చైనాకు వ్యతిరేకంగా ఏ కొంచెం మాట్లాడిన డ్రాగన్ కంట్రీ అణచివేస్తుంది అన్న విషయం తెలిసిందే. గతంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కూడా చాలా రోజుల పాటు కనిపించకుండా పోయారు.