Covid-19: చైనా కావాలనే కొవిడ్‌ను మనుషులకు ఎక్కించింది: వుహాన్ పరిశోధకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ వణికించిన సంగతి అందరికీ తెలిసిందే. లక్షల మంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారి ఎలా పుట్టిందనే అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా మనుషులకు ఎందుకు సోకింది అనే మూడేళ్లుగా సమాధానం లేని ప్రశ్నపై.. చైనాలో వుహాన్ నగరంలోని… వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఓ పరిశోధకుడు… ఆశ్చర్యకరమైన విషయాన్ని తెరపైకి తెచ్చారు. కరోనా వైరస్‌ని చైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మనుషులకు ఎక్కించిందని ఆరోపించారు. ఆ పరిశోధకుడి పేరు చావో షావో. తన తోటివారు కరోనా వైరస్‌కి సంబంధించిన 4 రకాల స్ట్రెయిన్లను మనుషులకు ఎక్కించారనీ.. ఏ స్ట్రెయిన్ బాగా వ్యాపిస్తుందో తెలుసుకోవడానికి అలా చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Also Read: Harassment: ఆసుపత్రిలో మహిళపై లైంగిక దాడికి యత్నం.. నర్సింగ్ అసిస్టెంట్ అరెస్ట్
Also Read
- Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
- Venkatesh Iyer: సడన్‌గా వెంకటేశ్ అయ్యర్‌కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోహ్లీతో ఓపెనర్‌గా రంగంలోకి..
- Chandrababu: ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ తయారవుతోంది
- Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ రికార్డు నాకు లెక్క కాదు.. టీ20ల్లో 200 కొట్టి చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ
చావో షావో వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో సైంటిస్ట్‌గా ఉన్నారు. ఆయన జెన్నీఫర్ జెంగ్ సంస్థకి ఇచ్చిన 26 నిమిషాల ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. షాన్ చావో అనే మరో రీసెర్చర్‌కి తన పైఅధికారి 4 రకాల కరోనా స్ట్రెయిన్లను ఇచ్చి.. వాటిని పరిశోధించమని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ నాలుగు స్ట్రెయిన్లలో ఏది ఎక్కువ జాతులకు వేగంగా, తేలికగా వ్యాపించగలదు? అన్నది కనిపెట్టడమే దీని ఉద్దేశం అని తెలిపారు. చావో షావో ప్రకారం.. చైనా కరోనాను జీవ రసాయన ఆయుధంగా భావించింది.
2019లో వుహాన్‌లో మిలిటరీ వరల్డ్ గేమ్స్ జరిగినప్పుడు తన కొలీగ్స్ కొంతమంది కనిపించలేదన్న చావో షావో… గేమ్స్ ఆడేందుకు వచ్చే అథ్లెట్లకు, కరోనా సోకేలా చేసేందుకే వారిని అథ్లెట్లు ఉంటున్న హోటళ్లకు పంపారని తర్వాత తెలిసిందని ఇంటర్వ్యూలో చెప్పారు. 2020 ఏప్రిల్‌లో చావో షాన్‌ను ఉయిఘర్స్ ఉండే క్యాంపుల దగ్గరకు పంపారనీ.. వైరస్‌ని మనుషుల మధ్య వ్యాప్తి చెందేలా చేసేందుకే.. ఇలా చేశారని చావో షావో అన్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది చనిపోయారు. ఇప్పటికీ ఆ వైరస్ ఇంకా సోకుతూనే ఉంది. దాని వ్యాప్తి, పుట్టుకపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మరి చావో షావో చెప్పింది ఎంతవరకూ నిజం అన్నది త్వరలో తెలిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్‌వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
-
Shiva Rajkumar: రామ్‌చరణ్‌కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై కన్నడ సూపర్ స్టార్ శివన్న సంచలన వ్యాఖ్యలు!
-
Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
-
Ram Charan : రామ్ చరణ్ తన బాడీగార్డ్‌కు రోజుకు ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
-
Venkatesh Iyer: సడన్‌గా వెంకటేశ్ అయ్యర్‌కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోహ్లీతో ఓపెనర్‌గా రంగంలోకి..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?