మానవ సేవే, మాధవ సేవ అన్నసామెతకి సరైన అర్థం చెప్పారు చిల్కూరు ఆలయ పూజారి సీఎస్ రంగరాజన్ స్వామి. యావత్ ప్రజానీకం మత ప్రాతిపదికన విభేదిస్తున్న తరుణంలో ఈ సంఘటన జరగడం విశేషమే అని చెప్పవచ్చు. కులం, మతంతో సంబంధం చూడకుండా ఆపదలో ఉన్న ముస్లిం కుటుంబానికి సహాయం చేసారు పూజారి సీఎస్ రంగరాజన్ స్వామి. చిలుకూరులో కొలువైన శ్రీనివాసుడికి వీసాల వెంకటేశ్వరుడని పేరు. చిల్కూరు బాలాజీ ఆలయం ఆపదలో ఉన్న రైతులను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడి ప్రజల్ని కష్టకాలంలో ఆదుకుంటోంది.
Also Read: IPL 2024: ఐపీల్ వేళ 10 జట్ల కెప్టెన్ల సక్సెస్ రేటు ఎంతో తెలుసా..?
ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న ఓ ముస్లిం కుటుంబానికి సహాయం చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. విద్యుదాఘాతంకు గురై తన వ్యవసాయ ఎద్దును కోల్పోయిన చిల్కూరు గ్రామానికి చెందిన రైతు మొహమ్మద్ గౌస్ కు మరో ఎద్దుని బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్బంగా.. ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ మాట్లాడుతూ.. మానవత్వం కులం, మతం చూడదు. తోటి మానవులకు సహాయం చేయడమే పరమాత్ముని సేవ అని తెలిపాడు.
Also Read: BRS Ex MLA Son: జూబ్లీహిల్స్ కారు యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్
గడిచిన 2 సంవత్సరాలలో.. విద్యుత్ షాక్ కు, పిడుగుపాటు లేదా మరేదైనా ప్రమాదంలో పశువులు మరణించిన రైతుల దుస్థితిని చూసి చలించిపోయిన ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ స్వామి.. గోసేవ ఔత్సాహికుడులో ఒకరైన పవన్ కుమార్ సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులకు ఆయన సహాయం అందించారు. ఇదివరకు సిద్దిపేటకు చెందిన రైతుకు గతంలో విద్యుత్ షాక్ తో పశువులను కోల్పోయిన వారికి కూడా చిలుకూరు బాలాజీ దేవాలయం ఆవును అందించింది. వీరితోపాటు పక్కనే ఉన్న గ్రామాలకు చెందిన కొందరు కూడా ఎద్దులను అందుకున్నారు.
In #Telangana– A temple priest gifts a bull to a Muslim farmer—
A message from @csranga garu—
Continuing its tradition of helping farmers in distress, the Chilkur Balaji temple has gifted a Bull to a farmer Mohd Ghouse belonging to Chilkur Village who had lost his farming… pic.twitter.com/0LQQQVpqFv
— @Coreena Enet Suares (@CoreenaSuares2) March 20, 2024