టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అభిమానులను పోగెసుకున్నాడు.. మాస్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన రామ్ కు ఈ మధ్య హిట్ సినిమాలు పలకరించలేదు.. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు.. ప్రస్తుతం రామ్ ఇష్మార్ట్ 2 సినిమాలో చెయ్యనున్నాడు.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి..
ఇక హీరోల న్యూ లుక్ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. తాజాగా రామ్ న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో రామ్ స్మార్ట్ గా లవర్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు.. కాస్త స్లిమ్ గా చాక్లేట్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు.. ఆ లుక్ అందరిని తెగ ఆకట్టుకుంది… ప్రస్తుతం రామ్ కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా రామ్ పోతినేని బీహెచ్ఈఎల్ లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు హాజరయ్యారు.. రామ్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. రామ్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు.. ఫుల్లీ లోడెడ్ గన్ లాగా రామ్ క్రేజీగా కనిపించాడు. ఫ్యాన్స్ అంతా డబుల్ ఇస్మార్ట్ అంటూ కేకలు పెట్టారు.. ప్రస్తుతం రామ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ఈ సినిమా నుంచి అధికార ప్రకటన రాబోతుంది..