King Cobra: కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో ఒకటి. కాటు వేసిన తర్వాత మనిషి బతకడం కష్టం. ఇకపోతే తాజాగా కింగ్ కోబ్రా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చుసిన వారికి చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు కింగ్ కోబ్రాతో ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడు పామును చాలాసార్లు తాకాడు. ఈ ప్రమాదకరమైన పామును పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తాడు. ఈ వీడియో చూసిన వారంతా వామ్మో.. చూడడానికే భయం వేస్తుంది.. అలాంటిది ఆ పిల్లడు ఎలా ఉన్నాడంటూ భావిస్తున్నారు.
Medical Services: నిలిచిన వైద్యసేవలు.. అత్యవసర పరీక్షలు సైతం అందక గర్భిణీల అవస్థలు
ఈ వీడియో నిజమేనని కొందరు నమ్ముతుండగా.., కొందరు దీనిని ఎడిట్ చేశారని, ఫేక్ అని చెబుతున్నారు. అయితే ఈ వీడియో ప్రామాణికతకు సంబంధించి ఇంకా ఖచ్చితమైన సమాచారం రాలేదు. ఈ వీడియో నిజమైతే, అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే నాగుపాము కుట్టడం ప్రాణాంతకం కావచ్చునని నిపుణులు అంటున్నారు. ఇంకా ఈ వీడియోలో, కింగ్ కోబ్రా పిల్లోడి దగ్గరకు వచ్చి అతనికి చాలా దగ్గరగా వెళ్లి అతని చేతులను తాకినట్లు చూడవచ్చు. ఈసారి పిల్లవాడు కూడా రెండు చేతులతో చాలా హాయిగా పట్టుకున్నాడు. కానీ., నాగుపాము పిల్లవాడి నోటి దగ్గరికి వెళ్లి మళ్ళీ దాని నుండి జారిపోతుంది. దీనితో పిల్లవాడు సంతోషిస్తాడు. ఆ తర్వాత కింగ్ కోబ్రా అతనిని దూరం నుండి చూస్తుంది. మొత్తం వీడియోలో కింగ్ కోబ్రాకు భయపడినట్లు చిన్నారి ఎక్కడా కనిపించలేదు.