Rohit-Virat: టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు భారత్ జట్టుకు కేవలం మూడే మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో జనవరి 11 నుంచి ఇందుకు సంబంధించిన సిరీస్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లీల అంతర్జాతీయ టీ20 భవితవ్యంపై వారిద్దరితో కూలంకషంగా చర్చించేందుకు రెడీ అవుతున్నాడు. అఫ్గాన్ తో సిరీస్‌కు వీరు అందుబాటులో ఉంటారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ తీసుకునేందుకు అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ చూస్తుంది.
Read Also: Hanuman: శ్రీ రామధూత స్తోత్రం పూనకాలు తెప్పించేలా ఉంది…
కాగా, ఈ మెగా టోర్నీకి ముందు జరుగనున్న ఈ సిరీస్‌కు టీమ్ ను ప్రకటించే అంశంపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోనూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ చర్చించనుంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు.. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జరిగే వరల్డ్‌కప్-2024 ఆడతారా లేదా అన్న అంశంపై సందిగ్దత కొనసాగుతుంది. ఐపీఎల్ రూపంలో పొట్టి ఫార్మాట్లో వీరు ఫామ్‌లోనే ఉన్నప్పటికి.. 2024 సీజన్ తర్వాత భారత టీ20 జట్టుతో చేరతారా? లేదంటే అంతకంటే ముందే అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు అందుబాటులోకి వస్తారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
Read Also: Zomato, Swiggy : ఇళ్లలో వంటే చేయనట్టుంది మనోళ్లు.. జొమాటోలో ప్రతి సెకనుకు 140 ఆర్డర్లట
అయితే, ఇప్పటికే టీ20కి కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వరల్డ్‌కప్‌కు ఆఖరి సన్నాహకంగా భావిస్తున్న అఫ్గాన్‌తో సిరీస్ వరకు వీరిద్దరు గాయాల బారి నుంచి కోలుకోకపోతే టీమ్ ను ముందుకు నడిపించేది ఎవరనే దానిపై అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో తాజాగా చర్చలు జరపబోతుంది.