ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన బుక్ స్టాల్స్‌ను సందర్శించారు. అనంతతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అశోక్ నగర్‌లో చిన్న స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ బుక్ ఫెయిర్.. ఈ రోజు ఈ స్థాయికి చేరినదుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు చేరువ కావాల్సిన పనిలో తప్పకుండా కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ చాలా పుస్తకాలతో ఎంతో విజ్ఞానం ఉంది.. ఇప్పుడు ఉన్న జనరేషన్ కేవలం గూగుల్ పైనే ఆధారపడుతున్నారు.. గూగుల్‌లో చెప్పేదే నిజం అనుకుంటారు.. కానీ పుస్తకాల్లో దొరికేదే నిజమైన సమాచారం అని సీఎం తెలిపారు. వారిని వారు గొప్పగా చూపించుకోవడానికి చరిత్రను మార్చి పెట్టుకోవడం గత 10 సంవత్సరాలు చూశాం.. ఈ పుస్తక ప్రదర్శన కోసం అవసరమైన భవనం ఏర్పాటుకు తన సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. అందుకు అవసరమైన విషయాలను ప్రొఫెసర్ కోదండరాం పరిశీలించాలని కోరుతున్నానని సీఎం అన్నారు.
Read Also: Jethwani Case: ముంబై నటి జత్వానీ కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిదని అన్నారు. నేటి సమాజంలో పుస్తకాలు పఠనం తగ్గింది.. చైతన్యం పరిజ్ఞానం కలిగించేది చదువు.. ప్రతి ఒక్కరూ కూడా పుస్తక పఠనం చేయడం అవసరం అని మంత్రి తెలిపారు. ఇక్కడ ఇంత పెద్ద పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక పుస్తకం కొనడానికి ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది.. కానీ అందరికీ అవసరమైన పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి కాబట్టి అందరూ వినియోగించాలని చెప్పారు. ఈ పుస్తక ప్రదర్శన జాతీయ స్థాయికి చేరాలని మంత్రి పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాలను చదవాలని అన్నారు. ఎక్కడో సుల్తాన్ బజార్‌లో తిరిగితే విద్య రాదు.. ఈ బుక్ ఫెయిర్ అందరూ వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ బుక్ ఫెయిర్ మరింత పెద్దగా ఏర్పాటుకు ముఖ్యమంత్రి సహకారంతో ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీ క్రీడా యాప్ లాంచ్.. ఇక, వారికి చెక్..!