Chhattisgarh Assembly Election 2023: నామినేషన్ దాఖలు చేసిన చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh Assembly Election 2023: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం దుర్గ్ జిల్లాలోని తన సాంప్రదాయ స్థానమైన పటాన్ నుంచి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 62 ఏళ్ల సీఎం దుర్గ్ కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న తన ట్విట్టర్ హ్యాండిల్లో చిత్రాలను పోస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ స్పీకర్ చరణ్ దాస్ మహంత్, రాష్ట్ర హోం మంత్రి తామ్రధ్వజ్ సాహు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన వెంట ఉన్నారు.
Also Read: Ayodhya: అయోధ్య రామ మందిరం రెడీ.. దర్శనాలు ఎప్పటి నుంచి అంటే..!
Also Read
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లే ముందు భూపేష్ బఘేల్ భిలాయ్‌లోని నివాసంలో ఆయన భార్య నుదిటిపై ‘తిలకం’ దిద్దిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.”మొదటిసారి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళిన రోజు నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఈ రోజు నేను పటాన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి నా భిలాయ్ నివాసం నుంచి బయలుదేరాను. నా భార్య ముక్తేశ్వరి ప్రతిసారీ తిలకం పెట్టింది. మీ ప్రేమే నా బలం. ఛత్తీస్‌గఢీయ ఆత్మగౌరవం, మీ అందరికీ సేవ చేయడంలో నేను ఎల్లప్పుడూ అంకితభావంతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాను’’ అని సీఎం తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read: Manish Sisodia : మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. కనీసం ఆర్నెళ్లు జైల్లోనే
పటాన్, గ్రామీణ నియోజకవర్గం, రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌తో సరిహద్దును పంచుకుంటుంది. భూపేష్ బఘేల్ పటాన్ స్థానం నుంచి ఐదు సార్లు గెలుపొందారు. 1993, 1998, 2003, 2013, 2018లో ఆయన ఆ స్థానం నుంచి గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే ఆరోసారి అవుతుంది. 2008లో ఆయన తన మేనల్లుడు అయిన బీజేపీకి చెందిన విజయ్ బఘేల్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ ప్రస్తుతం దుర్గ్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న విజయ్ బఘేల్‌ను ఈ అసెంబ్లీ స్థానంలో నిలబెట్టింది.
नाम- भूपेश बघेल
विधानसभा क्षेत्र- पाटनछत्तीसगढ़ महतारी के आशीर्वाद से आज पुनः पाटन विधानसभा क्षेत्र से प्रत्याशी के रूप में नामांकन दाखिल किया है. #फिर_से_कांग्रेस_लाएंगे pic.twitter.com/PwsnBDr2ku
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 30, 2023
తాజావార్తలు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!