Online Rummy : ఆన్‌లైన్ రమ్మీ ఓ ఉద్యోగి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై, చెన్నై సాలిగ్రామం సత్యమూర్తి నగర్ కు చెందిన కృష్ణామూర్తి ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఈయన కొన్నాళ్లుగా ఆన్ లైన్ రమ్మీకి బానిస అయ్యాడు. ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ వరుసగా డబ్బులు కోల్పోయాడు. అయితే కోల్పోయిన డబ్బులను ఎలాగైనా మళ్లీ సంపాదించాలనే పట్టుదలతో కూతురు పెళ్ళి కోసం దాచుకున్న డబ్బులు పెట్టి ఆన్ లైన్ రమ్మీ ఆడాడు. ఈ క్రమంలో దాదాపు రూ. 15 లక్షల వరకు కోల్పోయాడు.
Read Also:Seetharama Project: రైతులకు పండగే.. పంద్రాగస్టు రోజు సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం..
ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఆన్ లైన్ రమ్మీ వద్దని బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి హితవు పలికారు. ఆన్ లైన్ రమ్మీ కారణంగా ఏడాదిలోనే పదుల సంఖ్యలో అప్పులు అయ్యాయి. దీంతో అప్పులు తీర్చే మార్గం తెలియక కృష్ణ మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధలతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Read Also:Tollywood : నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సతీమణి కన్నుమూత..