Site icon NTV Telugu

Harirama Jogaiah: ముద్రగడకు హరిరామ జోగయ్య కౌంటర్‌ లేఖ.. ఇప్పటి వరకు పెద్దమనిషివి అనుకున్నా..!

Harirama Jogaiah

Harirama Jogaiah

Harirama Jogaiah: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను మరింత హీటెకిస్తోంది.. ముద్రగడ లేఖపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రశంసలు కురిపిస్తూ.. పవన్‌ను టార్గెట్‌ చేస్తుంటే.. జనసేన ముద్రగడపై విమర్శలు గుప్పిస్తోంది.. ఇక, సీనియర్‌ నేత హరి రామ జోగయ్య లేఖ ద్వారా ముద్రగడకు కౌంట్‌ ఇచ్చారు.. వారాహి యాత్ర ద్వారా దూసుకుపోతున్న పవన్ కల్యాణ్‌ని అనుసరించాలని కాపు సంక్షేమ సేన ఆశిస్తుందన్న ఆయన.. చిన్న మంత్రి పదవులు ఆశించి.. రెడ్డి కులాధిపతికి కాపులను తాకట్టు పెట్టాలని చూస్తున్న నాయకులను చూసి మోసపోకండి అని పిలుపునిచ్చారు.

Read Also: Yoga: రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఈ ఆసనాలతో ఆరోగ్యం మీ సొంతం..

ఇక, ముద్రగడ పద్మనాభం ఇప్పటివరకు పెద్దమనిషి అనుకున్నాను.. పవన్ కల్యాణ్‌ పై ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో నా నమ్మకానికి తూట్లు పొడిచిందని పేర్కొంటూ సుదీర్ఘమైన లేఖను రాశారు. తెర వెనుక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలికి.. జనసేనకు ఓట్లు పడకుండా చేసింది ముద్రగడ కాదా..? అంటూ లేఖలో దుయ్యబట్టారు. లక్షలాదిమంది కాపులు లక్ష్యానికి చేరువవుతున్న నేపథ్యంలో.. దానిని చెడగొట్టేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం వెనుక సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హస్తం లేదా? అని ముద్రగడను నిలదీశారు హరి రామజోగయ్య.

Read Also: Asia Fencing Championship: రికార్డు సృష్టించిన ఫెన్సర్ భవానీ.. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం

కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని తరచూ చెబుతున్నారు.. అటువంటప్పుడు జనసేన పార్టీకి మద్దత్తు ఇవ్వాలని.. తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎలా అడుగుతున్నారని నిలదీసిన విషయం విదితమే.. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయాలి అనే పదం వాడాలని సూచించిన ఆయన.. కలసి పోటీ చేసేటప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అనుకోవడం హాస్వాస్పదమన్నారు. ఇక, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దొంగ అయినప్పుడు.. రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుపొందారో ఆలోచించాలన్న ఆయన.. దుర్మార్గపు శాసనసభ్యులను అసెంబ్లీకి పంపించకుండా ఉండడం కోసం రేపు జరగబోయే ఎన్నికలలో వారి మీద పోటీ చేసి చిత్తుగా ఓడించాలని డిమాండ్ చేశారు. సత్తా చూపడానికి ముందుకు రావాలి.. వారిని శాశ్వతంగా రాజకీయాలనుండి తొలిగేలా చేయాలని తెలిపారు. కానీ, మీ ప్రసంగాలలో పదే పదే తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా.. అంటున్నారు. ఇప్పటి వరకూ ఎంతమందికి తీయించి, క్రింద కూర్చోబెట్టారో, గుండ్లు ఎంతమందికి చేయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలి అంటూ లేఖ ద్వారా పవన్‌పై ముద్రగడ సెటైర్లు వేసిన విషయం విదితమే.

 

 

 

 

 

 

Exit mobile version