Gas Cylinder : గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు ఇవి చెక్ చేయండి.. లేదంటే పేలే ప్రమాదం?
- వంట కోసం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉపయోగం
- తరచూ గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలు
- గ్యాస్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి
- సిలిండర్ తీసుకునేటప్పుడు ఇవి చెక్ చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో మనలో చాలా మంది వంట కోసం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ని ఉపయోగిస్తున్నారు. బొగ్గు, కలప వంటి సాంప్రదాయ వనరులతో పోలిస్తే.. ఎల్‌పీజీ సిలిండర్ వాడి వంట చేయడం చాలా సులభం. ఇది పోర్టబుల్ కాబట్టి.. మీరు దీన్ని ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇవి చాలా పొదుపుగా ఉంటాయి. నేడు, ఇది పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో సులభంగా అందుబాటులో ఉంది. ఇది కాకుండా భారత ప్రభుత్వం ప్రతి ఇంటికి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడానికి ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను అమలు చేస్తోంది. అయితే తరచూ గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలు చూస్తుంటాం. అందుకే గ్యాస్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అందుకే గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు సీలు తీసి, పరీక్షించి ఇవ్వమని తెచ్చిన వ్యక్తిని అడగండి లీకేజీ ఉంటే అప్పుడే తెలిసిపోతుంది. వంటగదిలోకి గాలి, వెలుతురు బాగా రావాలి. సిలెండర్‌ను షెల్ఫ్‌లో పెట్టి తలుపులు మూయడం లాంటివి చేయకండి.
READ MORE: Rajnath Singh: చైనా సరిహద్దుల్లో.. ఆర్మీతో కలిసి రాజ్‌నాథ్ దీపావళి వేడుకలు..
Also Read
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
కాస్త చల్లదనం ఉండే చోటే పెట్టండి. కొంతమంది సిలెండర్‌ను కింద పెట్టి, ఆ పక్కనే స్టౌ పెట్టి వండేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. స్టౌ ఎప్పుడూ సిలెండర్ కంటే ఎత్తులోనే ఉండాలి. గ్యాస్ సిలెండర్‌కు ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుందని చాలామందికి తెలియదు. అందులో ఉండే కోడ్ నెంబర్లను బట్టి గడువు ముందుగానే తెలుసుకోవచ్చు.
ఈ కోడ్ అంటే ఏమిటి..?
గ్యాస్ సిలిండర్ పైభాగంలో ప్రత్యేక కోడ్ రాసి ఉంటుంది. ఈ కోడ్ అక్షరాలు, సంఖ్యల రూపంలో ఉంటుంది. ఈ కోడ్ సిలిండర్ గడువు తేదీని సూచిస్తుంది. సిలిండర్‌పై రాసిన A, B, C, D..సంవత్సరంలో 12 నెలలను చూపిస్తుంది. ఈ సిలిండర్ ఎక్స్‌పయిరీ డేట్ గురించి చెబుతుంది.ఏడాదిలో 12 నెలలను నాలుగు భాగాలుగా విభజిస్తారు.
READ MORE:Noida: బీఎండబ్ల్యూ కారులో వచ్చి.. పూల కుండీ దొంగిలించిన మహిళ (వీడియో)
A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి.
B అంటే ఏప్రిల్, మే, జూన్.
C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్.
D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలా సిలిండర్‌పై ఉండే ఏబీసీడీలు నెలలను సూచిస్తుంది.
ఉదాహరణకు సిలిండర్‌లోపై A 23 అని రాసి ఉన్నట్లయితే ఈ సిలిండర్ గడువు 23- జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ముగుస్తుంది అని అర్థం. B 24 అని రాసి ఉంటే మీ సిలిండర్ గడువు ఏప్రిల్, మే, జూన్‌లలో ముగుస్తుందని అర్థం. దీన్ని బట్టి సిలిండర్ గడువు తేదీని అంచనా వేయొచ్చు. గడువు తేదీ దాటక సిలిండర్‌ను ఉపయోగించడం చాలా ప్రమాదం. సిలిండర్ పేలి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అందుకే తీసుకునేటప్పుడే చెక్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డేట్ అయిపోయిన గ్యాస్ సిలిండర్‌ను తీసుకోరాదు.
తాజావార్తలు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!