ఈ రోజుల్లో మనలో చాలా మంది వంట కోసం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ని ఉపయోగిస్తున్నారు. బొగ్గు, కలప వంటి సాంప్రదాయ వనరులతో పోలిస్తే.. ఎల్‌పీజీ సిలిండర్ వాడి వంట చేయడం చాలా సులభం. ఇది పోర్టబుల్ కాబట్టి.. మీరు దీన్ని ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇవి చాలా పొదుపుగా ఉంటాయి.