క్యూబా పోరాట యోధుడు చేగువేర జీవితంగా ఆధారంగా ‘చే’ మూవీ తెరకెక్కింది.. ‘లాంగ్ లివ్’ అనేది ఈ సినిమా ఉప శీర్షిక గా ఉంది.మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 15వ తేదీన ‘చే’ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో చేగువేరా పాత్రను బీఆర్ సబావత్ నాయక్ పోషించారు. ఆయనే ఈ మూవీకి దర్శకత్వం కూడా వహించారు. అలాగే ఈ సినిమాలో లావణ్య సమీర, పూల సిద్ధేశ్వర్, కార్తీక్ నూనే, వినోద్ మరియు పాసల ఉమామహేశ్వర్ ముఖ్య పాత్రలు పోషించారు.’చే’మూవీని నేచర్ ఆర్ట్స్ పతాకంపై సూర్య, బాబు, దేవేంద్ర నిర్మించారు. రవి శంకర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.ఇదిలా ఉంటే ‘చే’ మూవీ రిలీజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‍లోని ప్రసాద్ ల్యాబ్‍లో జరిగింది.చేగువేరా జీవితంపై సినిమా తెరకెక్కించాలన్నది తన 20ఏళ్ల కల అని హీరో మరియు డైరెక్టర్ అయిన బీఆర్ సబావత్ నాయక్ చెప్పారు.
పాఠశాల రోజుల నుంచి తనకు ఈ లక్ష్యం ఉందని ఆయన అన్నారు. స్నాక్స్ అమ్ముతూ డబ్బు దాచుకొని ‘చే’ చిత్రాన్ని రూపొందించామని ఆయన చెప్పారు. చెగువేరా గౌరవం ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తీసుకొస్తున్నట్టు సబావత్ అన్నారు. ‘చే’ సినిమా ప్రమోషనల్ మెటీరియల్స్ చూసి చెగువేరా కుమార్తె అలైడా గువేరా ప్రశంసించినట్లు ఆయన వెల్లడించారు.జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ.. ‘చే’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ అభిమానులు ఈ చిత్రానికి మద్దతుగా నిలుస్తారని ఆమె ఆశించారు. ఇలాంటి సినిమాలు యువతకు ఎంతో ముఖ్యమని ఆమె తెలిపారు.. చెగువేరా స్ఫూర్తి దాయక జీవితాన్ని తెలుగులో తీసుకొస్తున్నందుకు భరద్వాజ్ సంతోషం వ్యక్తం చేశారు.ప్రత్యర్థి మూవీ ఫేమ్ డైరెక్టర్ శంకర్ కూడా ‘చే ‘మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హాజరయ్యారు. చేగువేరా జీవితకథను వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అద్భుతమని, ఈ సినిమాకు అందరూ మద్దతుగా నిలవాలని ఆయన తెలిపారు.