Diamond Necklace: చెత్త కుప్పలో దొరికిన డైమండ్ నెక్లెస్.. చివరకి?
- పొరపాటున చెత్త బుట్టలో పడిపోయిన డైమండ్ నెక్లస్.
- రెండు రోజుల తర్వాత గుర్తుకు.
- పబ్లిక్ చెత్తకుప్పలో ప్రత్యక్షం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diamond Necklace Found Public Dustbin: ఒక్కసారి ఊహించుకోండి మనకు గాని లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరికితే ఎలాఉంటుందో. ఇక డైమండ్ నెక్లెస్ అందుకున్న తర్వాత ఎవరైనా ఆనందంతో గెంతులేస్తారు. అయితే పోగొట్టుకున్న వారికి వారి వజ్రాల హారం తిరిగి దొరికితే సంతోషం రెట్టింపు అవుతుంది. తమిళనాడులోని చెన్నైలో అచ్చం ఇలాంటిదే జరిగింది. ఓ వ్యక్తి ఇంట్లో ఉంచిన డైమండ్ నెక్లెస్‌ను ప్రమాదవశాత్తు చెత్తకుప్పల్లో పడేశాడు. కానీ., అతనికి ఈ విషయం గుర్తుకు వచ్చేసరికి చాలా ఆలస్యం అయింది. ఆ వ్యక్తి డైమండ్ నెక్లెస్‌ను కనిపెట్టేందుకు సహాయం కోసం మున్సిపల్ కార్పొరేషన్ బృందాన్ని సహాయం అడిగాడు. దాంతో మున్సిపల్ కార్పొరేషన్ బృందం చేసిన కృషి ఫలించింది. చెత్త కుప్పలో దండలో చుట్టి ఉన్న డైమండ్ నెక్లెస్ కనిపించింది.\
Viral Dance: ఢిల్లీ మెట్రోలో మరో కళాఖండం.. చూసారా..?
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ఇక పోయిన డైమండ్ నెక్లెస్ చూసిన వెంటనే ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ విషయం చెన్నైలోని విరుగంబాక్కం ప్రాంతంలో జరిగింది. ఇక్కడ నివాసముంటున్న దేవరాజ్ అనే వ్యక్తి ఇంట్లో ఉంచిన డైమండ్ నెక్లెస్ ప్రమాదవశాత్తూ పోగొట్టుకున్నాడు. దేవరాజ్ తల్లి ఈ డైమండ్ నెక్లెస్‌ని తన కూతురికి పెళ్లి కానుకగా ఇవ్వడానికి తెచ్చిందని., త్వరలో ఆమెకు పెళ్లి జరగాల్సి ఉందన్నారు. డైమండ్ నెక్లెస్ కనపరాకపోవడంతో పొరపాటున నెక్లెస్ ను డస్ట్‌బిన్‌లో పడేసిన సంగతి దేవరాజ్‌కి గుర్తుకు వచ్చింది. అయితే అప్పటికి రెండు రోజులు గడిచిపోయాయి. దింతో అతను నెక్లెస్ దొరుకుతుందా లేదా అని దేవరాజ్ కంగారుపడ్డాడు. ముందుగా ఈ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ బృందాన్ని కలిసి వాళ్ళకి విషయం మొత్తం చెప్పాడు.
Shraddha Das: కట్టెల పొయ్యిపై తెగ కష్టపడిపోతున్న హీరోయిన్..
మునిసిపల్ కార్పొరేషన్ బృందం దేవరాజ్‌తో కలిసి చెత్త వేయడానికి వెళ్లిన ప్రదేశానికి చేరుకున్నారు. దేవరాజ్ చెత్త వేసిన ప్రదేశంలో నగరంలోని ఇతర వ్యక్తులు కూడా అక్కడ చెత్తను వేస్తారు. దీంతో అక్కడ చెత్త కుప్పలో కాస్త ఎక్కువగానే చెత్త పేరుకుపోయింది. ఈ చెత్తలో డైమండ్ నెక్లెస్ వెతకాలి. క మునిసిపల్ బృందం తమ పనిని ప్రారంభించింది. చాలా కష్టపడిన బృందం చివరకి ఒక దండలో చుట్టబడిన డైమండ్ నెక్లెస్‌ను కనుగొన్నారు. అది చూసిన దేవరాజ్ ఊపిరి పీల్చుకున్నాడు. మున్సిపల్ కార్పొరేషన్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ -రిక్షా డ్రైవర్ ఆంథోనిసామి ఈ పనిలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను అక్టోబర్ 2020లో మునిసిపల్ కార్పొరేషన్ నుండి వ్యర్థాల నిర్వహణ కోసం కాంట్రాక్ట్ పొందిన కంపెనీకి ఉద్యోగి. ఇక ఈ డైమండ్ నెక్లెస్ ధర రూ. 5 లక్షలకు పైగా ఉంటుందని దేవరాజ్ తెలిపాడు. ఈ నెక్లెస్ నా సోదరి వివాహానికి బహుమతిగా ఇవ్వాలి. కానీ., చేసిన ఒక్క పొరపాటు వల్ల అది తప్పిపోయింది. ప్రస్తుతం దేవరాజ్ డైమండ్ నెక్లెస్ దరకడంతో చాలా సంతోషంగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!