NTV Telugu Site icon

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం.. ఇస్రో అధికారిక ప్రకటన.. డేట్‌ మారింది..

Chandrayaan

Chandrayaan

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంపై అధికారికంగా ప్రకటన చేసింది ఇస్రో.. ఈ నెల 13వ తేదీన చంద్రయాన్‌ ప్రయోగం ఉంటుందంటూ ముందుగా వెల్లడించిన.. ఇప్పుడు మూన్ మిషన్ ప్రయోగం ఒక రోజు వెనక్కి నెట్టబడింది.. ఈ ప్రయోగం జూలై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు జరగనుంది.. దీంతో.. చంద్రున్‌ ప్రయోగం కోసం మరో రోజు వేచి ఉండాలి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 జులై 13న బయలుదేరుతుందని గత వారం ప్రకటించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ఈ రోజు ప్రయోగాన్ని ఒక రోజు వెనక్కి నెట్టినట్లు తెలిపింది.

Read Also: Hyderabad Traffic Police : మైనర్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్

ఈ ప్రయోగం ఇప్పుడు జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో జరగనుంది. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ప్రయోగం తర్వాత రెండు నెలలపాటు ప్రయాణించనున్న స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌తో దాని జర్నీ ముగుస్తుంది. ఆ తర్వాత జాబిల్లపై పరిశోధనలు ప్రారంభమవుతాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గతంలోనూ చంద్రయాన్‌ మిషన్లు చేపట్టింది. మొత్తం ప్రయోగంలో సాఫ్ట్‌ల్యాండింగ్‌ చాలా క్లిష్టమైన ప్రక్రియ. చంద్రయాన్‌-2 సాఫ్ట్‌లాండింగ్‌లో విఫలం కావడంతో చంద్రుడిపై కూలిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 ప్రయోగం కోసం ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.. ఇప్పుడు కూడా సాఫ్ట్‌ల్యాండింగ్‌ ఏమంత సులభం కాదని కూడా నిపుణులు చెబుతున్నారు.

Read Also: Andhra Pradesh: వారిపై కేసులు ఎత్తివేయాలని మంత్రి, ఎంపీ విజ్ఞప్తి.. సీఎం సానుకూల స్పందన..

అయితే, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయిన తర్వాత అది చంద్రుడి ఉపరితలం దిశగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో దాని వేగాన్ని జాగ్రత్తగా నియంత్రించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. దీని కోసం థ్రస్టర్ల (ఇంజిన్లు)ను మండిస్తారు. ఈ ఏడాది జపాన్‌ పంపిన హకుటో-ఆర్‌ ల్యాండర్‌ కూడా ఇలాంటి కఠిన పరిస్థితినే ఎదుర్కొని విఫలమైన విషయం విదితమే.. మొత్తంగా.. ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేయడం ఎంత కీలకమో, అది దిగే ప్రదేశం కూడా అంతే ముఖ్యం. చంద్రయాన్‌-3లో రెండు ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌, అవాయిడెన్స్‌ కెమెరాలు ఉపయోగించారు. అవి పంపే ఫొటోలను బట్టి దానిని ఎక్కడ ల్యాండ్‌ చేయాలన్న తుది నిర్ణయా ఇస్రో శాస్త్రవేత్తలు తీసుకోనున్నారు..