Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార కొన్ని రోజులుగా వార్తల ముఖ్యాంశాల్లో నిలిచారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు ఆమెకు మధ్య కాపీ రైట్ వివాదం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. తన సినిమా పుటేజీని అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీ (బియండ్ ది పెయిర్ టేల్)లో ఉపయోగించారని.. అలా ఎలా ఉపయోగిస్తారని ధనుష్ రూ.10 కోట్లు దావా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే తాజాగా నయనతారకు మరో సమస్య ఎదురైంది. ఈ డాక్యుమెంటరీలోనే ‘చంద్రముఖి’ సినిమాలోని కొన్ని క్లిప్పింగులను అనుమతి లేకుండా ఉపయోగించినట్లు తెర మీదకు వచ్చింది. దీంతో ఆ సినిమా నిర్మాతలు నయనరతార, ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం నెట్ ప్లిక్స్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు. తమ కంటెంట్ ను చట్ట విరుద్దంగా వినియోగించుకున్నందకు రూ.5 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని నోటీసులిచ్చినట్లు సమాచారం. దీంతో’బియాండ్ ది పెయిర్ టేల్’ మళ్లీ నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది.
Read Also:Chhattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి 10 మంది జవాన్లు మృతి..
ధనుష్ కి ఇప్పుడు ‘చంద్రముఖి’ నిర్మాతలు రామ్ కుమార్ గణేషన్, ప్రభులు కూడా తోడయ్యారు. డాక్యుమెంటరీపై కలిసి మరిన్ని కేసులు వేసేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ‘చంద్రముఖి’ నిర్మాతల రియాక్షన్ నేపథ్యంలో నయన్ ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తికరంగా మారింది. ధనుష్ విషయంలో ఇప్పటికే నయన్ తాను చెప్పాలనుకున్నదంతా బహిరంగంగా లేఖ రాసింది. తాను చెప్పాలనుకున్నది అంతా చెప్పేసింది. ధనుష్ అనుమతి కోసం ఎంత ప్రయత్నించినా తాను టచ్ లోకి రాకపోవడంతోనే తన మేనేజర్ తో మాట్లాడి ముందుకెళ్లినట్లు స్పష్టం చేసింది. అలాగే ధనుష్‌కు తనపై ఎందుకంత కోపంగా ఉన్నాడో? ఎందుకు అంతగా ద్వేషిస్తున్నాడో? అర్దం కావడం లేదని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు తాను మంచి స్నేహితుడు గా ఉండేవాడని.. కానీ ఇప్పుడాయన పక్కన వాళ్ల మాటలు విని దూరం జరిగినట్లు చెప్పుకొచ్చింది. ఇలాంటివి క్లియర్ చేసుకోవడానికి ఆయనతో మాట్లాడలని ఎంత ప్రయత్నించినా ఫలించడం లేదన్నారు. న్యాయంగా , తప్పులేకుండా చేసిన ప్రయత్నం విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మరి చంద్రముఖి నిర్మాతల విషయంలో ఎలా స్పందిస్తారో తెలియాలి.
Read Also:Pushpa 2: ఇండియన్ సినీ రికార్డులను తిరగరాసిన పుష్ప-2 ది రూల్