బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్,రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలు పోషించిన చంద్రముఖి-2 చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.కామెడీ హారర్ థ్రిల్లర్‌గా పి.వాసు ఈ మూవీని తెరకెక్కించారు.2005లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం చంద్రముఖికి సీక్వెల్‍గా చంద్రముఖి-2 మూవీ తెరకెక్కింది..కానీ ఈ మూవీ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన చంద్రముఖి-2 చిత్రం.. ఇప్పుడు టీవీ లో ప్రసారమయ్యేందుకు సిద్ధం అయింది.చంద్రముఖి-2 సినిమా తెలుగు వెర్షన్ జెమినీ ఛానెల్‍లో డిసెంబర్ 31 తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ తేదీపై తాజాగా ప్రకటన కూడా వచ్చేసింది. మరోవైపు, చంద్రముఖి-2 తమిళ వెర్షన్ సన్ టీవీ ఛానెల్‍లో జనవరి 1 (2024) సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం అవుతుంది.
చంద్రముఖి 2 చిత్రం ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులో ఉంది. అక్టోబర్ 26 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.చంద్రముఖి 2 చిత్రంలో వడివేలు, రాధిక శరత్‍కుమార్, లక్ష్మీ మీనన్, మహిమ నంబియార్, సృష్టి డంగే, సుభిక్ష కృష్ణన్, సురేశ్ చంద్ర మరియు విఘ్నేష్ కీలకపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి.. ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.భారీ అంచనాల మధ్య థియేటర్లలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో అడుగుపెట్టిన చంద్రముఖి-2 తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కేవలం రూ.40కోట్ల కలెక్షన్‍లను మాత్రమే ఈ చిత్రం రాబట్టినట్లు సమాచారం