నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘రా.. కదలిరా’ సభ నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. 11:15 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 11:50 గంటలకు పీలేరుకు చేరుకోనున్నారు.