Chandrababu Release: రాజమండ్రి టు విజయవాడ.. 14 గంటల పాటు సాగిన చంద్రబాబు ప్రయాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Release: రాజమండ్రి టు విజయవాడ.. సాధారణంగా కారులో వెళ్తే 3 గంటల్లోపే చేరుకోవచ్చు.. అదే వీఐపీ.. జడ్+ సెక్యూరిటీ ఉన్నవాళ్లు అయితే.. అటు ఇటుగా రెండు – రెండున్నర గంటల్లోపే చేరుకునే అవకాశం ఉంటుంది.. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి నుంచి విజయవాడలోని తన నివాసానికి చేరుకోవడానికి 14 గంటల సమయం పట్టింది.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు.. 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే కాగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో.. మంగళవారం రోజు సాయంత్రం 4.15 గంటల సమయంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.. అంతే కాదు.. ఆయనకు దారి పొడవునా నీరాజనాలు పట్టారు.. టపాసులు కాల్చారు.. పూల వర్షం కురిపించారు.. హారతలు పట్టారు.. అలా 14 గంటల పాటు ఆయన ప్రయాణం కొనసాగింది..
చంద్రబాబు ఈ 14 గంటల ప్రయాణంలో దాదాపు 15 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు 200 మందికి పైగా చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది ఉండగా.. దారిపొడవునా లక్షలాది మంది టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు.. ఇలా మంగళవారం రోజు సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో రాజమండ్రి నుంచి బయల్దేరిన చంద్రబాబు.. ఈ రోజు అంటే బుధవారం రోజు ఉదయం 6 గంటల సమయంలో విజయవాడలోని తన నివాసానికి చేరుకున్నారు.. బెజవాడలో రాత్రి 3 గంటలు దాటాక కూడా వేచి ఉన్నారు జనం.. గన్నవరం విమానాశ్రయం వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు మొరాయించటంతో మరొక కారులోకి టీడీపీ అధినేత షిఫ్ట్ అయ్యారు.. విజయవాడ నుండి తెప్పించిన బ్లాక్ ల్యాండ్ క్రూజర్ కారులోకి మారారు చంద్రబాబు.. రాత్రి 3 గంటల ప్రాంతంలో చంద్రబాబు కాన్వాయ్ విజయవాడ శివారు ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు వైపుగా ముందుకు సాగింది. తెల్లవారుజామున సైతం రోడ్లవెంట పెద్దసంఖ్యలో మహిళలు, అభిమానులు, ప్రజలు రోడ్లవెంట బారులు తీరి చంద్రబాబుకు స్వాగతం పలికారు.. కాన్వాయ్ అవిశ్రాంతంగా ముందుకు సాగడంతో.. చంద్రబాబు అలసిపోయినట్టు కనిపించారు.. ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోగానే.. చంద్రబాబుకి స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు. రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల అయిన నారా చంద్రబాబు నాయుడు ఉదయం 6 గంటలకు ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భం చంద్రబాబు కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనను చూసి భావోద్వేగానికి గురి అయ్యారు. వారికి చంద్రబాబు దైర్యం చెప్పారు. అయితే.. కోర్టు ఉత్తర్వుల మేరకు ఎక్కడ ప్రసంగించలేదు చంద్రబాబు.. కోర్టు ఆంక్షల నేపథ్యంలో కారు కూడా దిగకుండా ముందుకు సాగారు..
Also Read
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు చంద్రబాబు. చంద్రబాబును పరామర్శించేందుకు నేతలు, కార్యకర్తలెవరూ రావద్దని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశాడు… ఇక, ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ వెళ్లనున్నారు చంద్రబాబు. రేపు హైదరాబాద్ ఏఐజీ, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోనున్నారు.. మరోవైపు.. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాకు అచ్చెన్నాయుడు వాట్సాప్ మెసేజ్ పంపారు. కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు ప్రయాణం సాగిందని వాట్సాప్ మెసేజ్ లో పేర్కొన్నారు అచ్చెన్న. వేలాదిగా ప్రజలు వచ్చినా ఎక్కడా వాహనం దిగలేదని అచ్చెన్నాయుడు వెల్లడించారు. తన కాన్వాయ్ వెంబడి ఎలాంటి వాహనాలు అనుమతించొద్దని సీఐ రాజుకు చంద్రబాబు చెప్పారనే విషయాన్ని సీపీకి వివరించారు అచ్చెన్నాయుడు. ఇదే విషయాన్ని తన ప్రయాణం పర్యవేక్షిస్తున్న డీసీపీకి తెలపాలని చంద్రబాబు కోరారని వాట్సాప్ మెసేజ్ ద్వారా సీపీకి వెల్లడించారు అచ్చెన్నాయుడు.
తాజావార్తలు
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!