ఏపీ ప్రజలకు, తెలుగువారికి శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ప్రజలంతా పంచాంగం కోసం ఎదురు చూస్తారు.నాలుగేళ్లు ఈ రాష్ట్రంలో కష్టాలే ఉన్నాయి.శోభకృత్ నామ సంవత్సరంలో శుభాలే జరుగుతాయని ఆశ.ఏపీ ప్రజలకు వెలుగు రావడం ఖాయం.తెలుగు వారు ముందే పంచాంగం చెప్పారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు చేసి.. ఓట్లేశారు.అరాచకానికి ఓ పద్దతి.. ఓ విధానం ఉంటుంది.కానీ గత 40 ఏళ్లల్లో ఎప్పుడూ చూడని అరాచకాలు చూశాను.ప్రశ్నించిన పేదలపై దాడులు జరిగాయి.అధికార పార్టీ ఆశలు సాగవని పంచాంగంలో కూడా చెప్పారు.మహిళలకు రక్షణ ఉండాలి.ధరలు పెరిగాయి.. పన్నులు పెరిగాయి.. ప్రజలపై భారం పడింది.ధరలు పెరుగుదలపై రాజీ లేని పోరాటం.పంచాంగం ఓ డెరెక్షన్ ఇస్తుంది.. సూచన ప్రాయంగా సంకేతాలిస్తుంది.పంచాంగం ఎంతో శాస్త్ర్రోక్తంగా రాస్తున్నారు.అస్ట్రాలజీ కూడా సైన్సే.ప్రజలు జాగ్రత్త పడడానికి పంచాంగం ఉపయోగపడుతుంది.తెలుగు జాతి అనేక రంగాల్లో రాణిస్తోంది.నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వారి ప్రతిష్ట పెరిగింది.
Read Also: Das Ka Dhamki Review: దాస్ కా ధమ్కీ మూవీ రివ్యూ
ఉగాదికి టీడీపీకి దగ్గర సంబంధం ఉంది. తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీ.దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుంది. నేరగాళ్లు,రుణ ఎగవేత దారులు పెరిగిపోతారు. ప్రకృతి విపత్తులు ఇబ్బందులు గురిచేస్తాయి. ప్రధాన ప్రతిపక్షానికి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. మిత్రపక్షాలన్నీ ఏకమమవుతాయి. అధికార పక్షం కేసులు పెట్టిన ప్రధాన ప్రతిపక్షం వాటిని ధీటుగా ఎదుర్కొని ముందుకు వెళుతుంది. చంద్రబాబు లక్ష్యసాధన కోసం విశేష కృషి చేస్తారు. చంద్రబాబు సత్ఫలితాలు పొందుతారు. నిర్ణయాలలో తొందరపాటు కాకుండా చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ఏడాది టీడీపీలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు చంద్రబాబు.
Read Also: TDP Ugadi Panchangam: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు