Chandrababu: నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
- నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
- నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు
- ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ చంద్రబాబు ప్రమాణస్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని సభాప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరవనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యం-ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జితన్ రామ్ మాంఝీ, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖా మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర రోడ్ల రవాణా-ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ.రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేష్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలెప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖా మంత్రి అనుప్రియా పటేల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయశాఖా మంత్రి రామ్‌దాస్ అథవాలే,రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేల్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేశారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజీని ఏర్పాటు చేశారు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేశారు.
Read Also: AP Cabinet: ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల.
Also Read
ఈ కార్యక్రమానికి వీవీఐపీలు వస్తుండడంతో పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 10వేల మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారు. ప్రాంగణం పక్కనే ఉన్న నేషనల్ హైవేపై ట్రాఫిక్‌జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి పాస్‌లు ఉన్నవారినే చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవేపైకి అనుమతిస్తారు. పాస్‌లు లేనివారిని రోడ్లపైకి అనుమతించబోమని విజయవాడ పోలీసులు తెలిపారు. సభకు వచ్చేవారు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని, వాహనాల్లో ఉంచి ప్రాంగణంలోకి రావాలని కోరారు. బుధవారం ఉదయం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమలకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం శ్రీవారి దర్శించుకోనున్నారు. అనంతరం తిరిగి అమరావతికి రానున్నారు.
చంద్రబాబు 24 మంది మంత్రులతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది. ఓసీలకు 12 మంత్రి పదవులు కేటాయించగా.. బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి 8 మంత్రి పదవులను కేటాయించారు. ఎస్సీలకు 2 మంత్రిపదవులు కేటాయించగా.. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఒకరికి చోటు లభించింది. అలాగే మైనార్టీలకు కూడా ఒక మంత్రిపదవిని కేటాయించారు. సగానికి పైగా కొత్తవారికి అవకాశం లభించింది. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!