Chandrababu Birthday: ఎవరూ ఆకలితో ఉండకూడదు.. ప్రతి ఒక్కరి కడుపు నిండాలన్నదే లక్ష్యం!
- ప్రతి ఒక్కరి కడుపు నిండాలి
- కేవలం 5 రూపాయలకే మూడు పూటలా భోజనం
- ప్రస్తుతం రాష్ట్రంలో 269 అన్న క్యాంటీన్లు
- ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ల ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి కడుపు నిండేలా చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. అన్న క్యాంటీన్ల ఆలోచనకు ప్రేరణగా ఎన్టీఆర్ తిరుమలలో ప్రారంభించిన అన్నప్రసాదం కార్యక్రమాన్ని గుర్తుచేశారు. పేదలకు కేవలం దానం చేయడం కాకుండా.. గౌరవప్రదమైన వాతావరణంలో శుభ్రమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే ఈ పథకం ప్రత్యేకత సీఎం పేర్కొన్నారు.
‘అన్న క్యాంటీన్లలో ప్రత్యేక క్యాంపస్, కాంపౌండ్ వాల్, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాము. కేవలం రూ.5కే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా భోజనం అందించడం ద్వారా ఆటో డ్రైవర్లు, కూలీలు, రోడ్లు శుభ్రం చేసే కార్మికులు వంటి సామాన్య ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతోంది. ఇస్కాన్ ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. ఇటీవల 62 కొత్త క్యాంటీన్లు ప్రారంభించాము. త్వరలో మరో 5 ప్రారంభించి మొత్తం సంఖ్యను 274కి పెంచుతాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Also Read
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
- Virat Kohli Records: "నువ్వు మామూలోడివి కాదు సామీ".. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
- ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
- Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మూడు పూటలా ఉచిత భోజనం అందించేందుకు రూ.76 లక్షలు విరాళంగా ఇచ్చిన నారా భువనేశ్వరిని సీఎం అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఒక పూట భోజనం లేదా ఒక రోజు క్యాంటీన్ ఖర్చును భరించడం ద్వారా ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాకుండా, ప్రజలందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాల్సిన స్ఫూర్తిదాయక వేదిక అని చంద్రబాబు అన్నారు. ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని, కేవలం ఆహారం అందించడమే కాకుండా వారి అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని తెలిపారు. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించే దిశగా అందరూ ఆలోచించాలని, అదే నిజమైన ప్రజాస్వామ్యం అని సీఎం పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను ‘అన్నపూర్ణ’గా నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో అన్న క్యాంటీన్లు మూసివేయబడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. పేదల కోసం పనిచేసే కార్యక్రమాలు ఎప్పటికీ ఆగకూడదన్నారు. రాష్ట్రంలోని పేదలను ఆదుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. నేడు సీఎం చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌ను సీఎం దంపతులు సందర్శించారు. ఇద్దరూ స్వయంగా పేదలకు అల్పాహారం వడ్డించి.. భోజనం చేయడం విశేషం.
తాజావార్తలు
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
-
Virat Kohli Records: “నువ్వు మామూలోడివి కాదు సామీ”.. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
-
Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!