Site icon NTV Telugu

CM Chandrababu: విద్యార్థులను కలిసిన సీఎం చంద్రబాబు.. జీఎస్టీ సంస్కరణలపై వివరణ..

Cm

Cm

CM Chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలను ముఖ్యమంత్రి సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు.

READ MORE: Kishan Reddy: తొందరపడి దళారుల చేతిలో పడొద్దు.. 12 శాతం తేమ ఉన్నా సీసీఐ పత్తి కొంటుంది!

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా..? అని వారిని సీఎం అడిగారు. నిత్యావసరాల్లోని చాలా వస్తువులు సున్నా శాతం, 5 శాతం స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని.. దీని వల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు. నాటిన కొంత కాలానికి చెట్టు ఫలాలు ఇస్తున్నట్టు… సంస్కరణలను ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని సీఎం వివరించారు. జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లు, పెయింటింగ్, ఉపన్యాస పోటీల్లో పాల్గొనడం… వాటిల్లో విజేతలుగా నిలవడం అభినందించదగ్గ విషయమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

READ MORE Zubeen Garg Death: జుబీన్ గార్గ్ మరణంపై సింగపూర్ పోలీసులు కీలక ప్రకటన

Exit mobile version