Chandrababu Naidu: భయం వద్దు.. మీకు అండగా నేనుంటా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుడిపల్లి మండలం సంగనపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఉన్మాది సీఎం చెప్పాడని నన్ను పోలీసులు కుప్పంలో అడ్డుకున్నారు.. నాకు వాహనం ఇవ్వక పోతే బస్సు పైకెక్కి మాట్లాడాను. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మాట్లాడుతున్నా. రాజ్యాంగం రాసింది సైకో జగన్ రెడ్డి కాదు…అంబేద్కర్ అని తెలుసుకోవాలి. జగన్ ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదు. జగన్ పాలనలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి పోయింది. రాష్ట్రంలో ఎక్కువ కాలం సీఎంగా ఉన్న నాకు గౌరవం ఇవ్వని సీఎం ఈ జగన్ రెడ్డి. సీఎం మాటలు వింటే పోలీసులూ జైలుకు పోతారు. ఇంత ఫెయిల్ అయిన సీఎంను ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు చంద్రబాబు.
Also Read
ఏమి చేశారని ఈ సీఎంకు జనం ఓట్లు వెయ్యాలి..?అన్ని ధరలు పెరిగాయి….ప్రజల బతుకు భారం అయ్యింది.సంగనపల్లికి కూడా పొరుగు రాష్ట్రం మందు వస్తోంది. ఈ వ్యాపారం చేసేది కూడా వైసీపీ నేతలే.రాష్ట్రంలో పిల్లలు గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడ్డారు.విశాఖను డ్రగ్స్ రాజధాని చేశారు.అందుకే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని కార్యక్రమం పెట్టాను. నాడు పాడి పరిశ్రమకు మద్దతు ఇచ్చాను.
ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా పాడి పంట ఉంది.వైసిపి వచ్చాక కుప్పంలో ఒక్క పనైనా చేశారా.?ఈ ఊళ్ళో ఒక్క పనైనా జరిగిందా?ఈ ప్రాంతంలో మళ్ళప్ప కొండను ఎంతో అభివృద్ధి చేశాం. ఈ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగమూ రాలేదు. మన ప్రాంతంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు.అందుకే సైకో పోవాలి…సైకిల్ రావాలి.చరిత్రలో ఫెయిల్డ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.పోలీసుల మెడల మీద కత్తి పెట్టి వాళ్ళతో అక్రమాలు చేయిస్తున్నారు.వ్యవస్థలను నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. పట్టాదారు పాసు పుస్తకం మీద అసహ్యం పుట్టించే జగన్ బొమ్మ ఎందుకు?
ప్రజల ఆస్తుల మీద దరిద్రుడి బొమ్మలు ఎందుకు?ఉద్యోగులు జీతం వస్తే చాలు అనే స్థితికి వచ్చారు.వాళ్ళ హక్కులన్నీ పోయాయి.కుప్పం కోసం హంద్రీనీవ నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేశాను. ఆ పనులు కూడా ఈ ముఖ్యమంత్రి ఆపేశారు.కుప్పంలో నేను ఇల్లు కట్టుకుంటూ ఉంటే అనుమతి కూడా ఇవ్వలేదు.ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి?గ్రానైట్ వ్యాపారుల నుంచి 50 కోట్లు వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే ఫైన్ కట్టాలి అంటున్నారు.ఎవరూ కమిషన్ ఇవ్వాల్సిన పనిలేదు. అవసరం అయితే వ్యాపారులు కోర్టు కు వెళ్ళండి.నేను మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు చంద్రబాబునాయుడు.
Read Also: Unstoppable 2: బాలయ్యతో ప్రభాస్ ‘రాణి’ ఎవరో గోపీచంద్ చెప్పాడా!?
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!