ఏపీలో రివర్స్ పాలన జరుగుతోంది.రివర్స్ పాలనలో జగన్ గేర్లు మారుస్తూ చాలా స్పీడుగా వెళ్తున్నారని.. దీంతో వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. యువత నిరాశకు లోనయ్యారు.. పెట్టుబడులు రావడం లేదు. సన్ రైజ్ ఏపీ అనే పేరుతో ఏపీలో పెట్టుబడులని ఆకర్షించాం.. గ్లోబల్ ఎడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశాం. ఏపీలో వనరులను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల పరంగా విజన్ 2021 అని రూపొందించాం. విజన్ 2021 ప్రకారం టీడీపీ హయాంలో పని చేశాం అన్నారు.
Read Also: CM KCR Delhi Tour: ఢిల్లీకి సీఎం కేసీఆర్.. ఎప్పుడంటే?
పెట్టుబడుల కోసం శ్రమించాం.. వివిధ రంగాల్లో ఏపీని నెంబర్-1గా నిలిపాం.పోర్టులను అనుసంధానం చేసుకుంటూ పోర్ట్ లెడ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాం.కృష్ణపట్నం నుంచి భావనపాడు వరకు పోర్టుల నిర్మాణం కోసం కృషి చేశాం.భావనపాడు పోర్ట్ అంటే టీడీపీ గుర్తొస్తుందని మూలపాడు పోర్టు అని పేరు మార్చారు.జగన్ కన్నార్పకుండా అబద్దాలు చెబుతారని చంద్రబాబు మండిపడ్డారు. హైదరాబాద్ కోసం రూపొందించిన విజన్ 2020 గురించి ఇప్పుడెవరైనా మాట్లాడితే వైసీపీ నేతలు చిర్రుబుర్రులాడుతున్నారన్నారు. మరోవైపు వర్షాల కారణంగా చంద్రబాబు పర్యటనలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన వుంది. అలాగే, 5వ తేదీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న పంటలను పరిశీలించనున్నారు చంద్రబాబు.
కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం పెట్టుబడుల్లో ఏపీ అధోగతికి వెళ్లిపోయింది.టీడీపీ హయాంలో రూ. 6 లక్షల పెట్టుబడులు వచ్చాయి.. ఈ విషయాన్ని గౌతమ్ రెడ్డి కూడా చెప్పారు.కేవలం రూ. 5751 కోట్లు పెట్టుబడులు మాత్రమే వచ్చాయి.ఇంత తక్కువ పెట్టుబడులా..?పెట్టుబడుల విషయంలో దిగువ నుంచి ఏడో రాష్ట్రంగా ఉన్నారు.సీఎం జగనుకు సిగ్గు అనిపించడం లేదా..?
ఇంత తక్కువ పెట్టుబడులు వస్తే యువతకు ఉపాధి ఎలా లభిస్తుంది.ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నారు.మళ్లీ ఏపీ ముఖం నుంచి లూలూ గ్రూప్ అధినేత యూపీకి వెళ్లారు.. అక్కడ పెట్టుబడులు పెట్టారు.అదానీ డేటా సెంటరుకు ఆ రోజే ఫౌండేషన్ వేశాం.ఇప్పుడు సీఎం జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారు.వేలాది కోట్ల పెట్టుబడులను వెనక్కు వెళ్లాయి.. ఎవరి పాపం ఇది.కడప స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్ రెండు సార్లు ఫౌండేషన్ వేశాడు.. ఇవేం తిక్క పనులు.ఇలాంటి పనులు సీఎం చేస్తే ఏపీలో ఉన్నవాళ్లంతా తిక్కొళ్లే అనుకుని ఎవ్వరూ పెట్టుబడులు పెట్టడానికి రావడం లేదన్నారు.
Read Also: Vijaya Publications: ఎం.ఎల్. నరసింహం చెబుతున్న ‘పాట వెనుక భాగోతం’!