NTV Telugu Site icon

TDP-Janasena Alliance: ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్ కళ్యాణ్!

Pawan Kalyan

Pawan Kalyan

TDP-Janasena Alliance: ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ-జనసేన మరింత వేగం పెంచుతోంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ కాగా.. నేడు అమరావతిలో మరోసారి సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఇద్దరు నేతలు కీలక చర్చలు చేస్తున్నారు.

Also Read: Prasad Raju: మూడు రాజ్యసభ స్థానాలు మాకే వస్తాయి: చీఫ్ విప్ ప్రసాద్‌ రాజు

గత 4 రోజులుగా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడివిడిగా కసరత్తు చేశారు. జనసేన పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే బాబు-పవన్‌ ఓ అవగాహనకు వచ్చారట. జనసేనకు 25 స్థానాలు ఇస్తామని చంద్రబాబు అంటుండగా.. ఎక్కువ స్థానాలు కావాలని పవన్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లను జనసేనాని ఆశిస్తున్నారట. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని పవన్ పట్టుబడుతున్నారని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై తుది కసరత్తు జరుగుతుండగా.. ఒకట్రెండు రోజుల్లో టీడీపీ-జనసేన క్లారిటీకి రానుందట. రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Show comments