CM Chandrababu: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. మరో రెండు నెలల తర్వాత ఏపీ బడ్జెట్!
- విభజన వల్ల ఏపీకి నష్టం జరిగింది- సీఎం చంద్రబాబు
- గత ఐదేళ్ల పాలన వల్ల ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేని పరిస్థితి వచ్చింది
- బడ్జెట్ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉంది- ముఖ్యమంత్రి
- ఆర్థిక గందరగోళ పరుస్థితులు చక్కదిద్ది మరో రెండు నెలల తర్వాత బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి ఉంది
- ఇబ్బందులను అధిగమించి ఏపీని నెంబర్-1 స్థానంలో నిలపాలి- సీఎం
- గత ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు విసుగెత్తిపోయారు- చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల పాలన వల్ల ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేని పరిస్థితి వచ్చిందని తెలిపారు. బడ్జెట్ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉందని ఆరోపించారు. ఆర్థిక గందరగోళ పరుస్థితులు చక్కదిద్ది మరో రెండు నెలల తర్వాత బడ్జెట్ పెట్టుకునే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఇబ్బందులను అధిగమించి ఏపీని నెంబర్-1 స్థానంలో నిలపాలని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని ఆరోపించారు.
Vijay Devarakonda Photo: ఎలా ఉండే వాడు, ఎలా అయ్యాడు.. విజయ్ దేవరకొండను గుర్తుపట్టడం కష్టమే!
Also Read
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
- Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్‌కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
- Google Mapsలో సూపర్ అప్డేట్.. హోటల్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ వరకు అన్నీ ఒకేచోట
ఏపీలో అత్యధిక మెజార్టీ సాధించిన గాజువాక ఎమ్మెల్యే పల్లాకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. పవన్ క్లిష్ట సమయంలో కీలకంగా వ్యవహరించారు.. రాష్ట్రం కోసం టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ అని చంద్రబాబు తెలిపారు. ఓట్లు చీలకూడదు.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని పవన్ సామాజిక బాధ్యతతో ఆలోచించారన్నారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సమైక్యంగా పని చేస్తామని తెలిపారు. గత ఐదేళ్లల్లో ప్రజలకు నరకం అంటే ఏంటో చూపించారు చంద్రబాబు పేర్కొన్నారు. మెడ మీద కత్తి పెట్టి భూములు, ఆస్తులు రాయించుకున్నారని అన్నారు. ఆడబిడ్డల మాన, ప్రాణాలకు రక్షణ లేదు.. సభలో ఉన్న సగం మంది ప్రత్యక్షంగా.. మరి కొంత మంది పరోక్షంగా గత ప్రభుత్వ బాధితులేనని తెలిపారు. స్పీకర్ అయ్యన్న లాంటి వ్యక్తి మీదే అత్యాచార యత్నం కేసు పెట్టారంటే బాధేస్తోందని చెప్పారు. అచ్చెన్నాయుడు, నారాయణ వంటి వారిని గత ప్రభుత్వం విపరీతంగా హింసించిందని ముఖ్యమంత్రి తెలిపారు.
Harish Rao: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు..
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అభివృద్ధి చేసే అమరావతి పోయింది.. జీవనాడి పోలవరం పోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత మాదేనని కేంద్రం చెప్పింది.. సంతోషం అని తెలిపారు. ప్రాజెక్టులు.. ప్రాజెక్టుల గేట్లు కూడా కొట్టుకుపోయాయి.. ఆ ప్రాజెక్టు గేట్లు పెట్టడానికి కూడా నిధులివ్వలేదన్నారు. అరాచకాలు చేసి.. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన వ్యక్తి ప్రజాస్వామ్యం కాపాడాలంటూ ప్లకార్డు పట్టుకున్నారని దుయ్యబట్టారు. అమర్నాధ్ గౌడ్ అనే పదో తరగతి బాలుడిని పెట్రోల్ పోసి తగులబెట్టారని మండిపడ్డారు. అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తనను ఇదే సభలో అవమానించారు.. కౌరవ సభలో ఉండను.. గౌరవ సభలో ఉంటానని వెళ్లిపోయానని చంద్రబాబు చెప్పారు.
బాధితులనే నిందితులను చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కింది.. ఇన్ని చేసి ఇప్పుడు జగన్ ఢిల్లీకి వెళ్లారని చంద్రబాబు చెప్పారు.
తాజావార్తలు
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్‌లకు గుడ్‌న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
-
Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
-
Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్‌కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!