Vijay Devarakonda Photo: ఎలా ఉండే వాడు, ఎలా అయ్యాడు.. విజయ్ దేవరకొండను గుర్తుపట్టడం కష్టమే!
- జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో సినిమా
- శరవేగంగా షూటింగ్
- విజయ్ దేవరకొండ నయా లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Devarakonda’s New Look Shakes Internet from VD 12: టాలీవుడ్ యంగ్ హీరో ‘విజయ్ దేవరకొండ’ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న రోల్స్ చేసి.. స్టార్ హీరోగా ఎదిగారు. ‘పెళ్లి చూపులు’ సినిమా విజయ్‌కు హిట్ ఇస్తే.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు మంచి బ్రేక్ ఇచ్చాయి. నోటా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ నిరాశపర్చినా.. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు పర్వాలేదనిపించాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయ్ గన్ పట్టుకుని ఉన్న పోస్టర్‌ను గత నెలలో విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. తాజాగా విజయ్‌కు సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్‌పై వెనకాల కూర్చొని తీక్షణంగా చూస్తున్నాడు. గడ్డం, పొట్టి షార్ట్ హెయిర్ స్టైల్‌లో గుర్తుపట్టలేకుండా ఉన్నాడు. ఇది చూసిన నెటిజెన్స్.. ‘ఎలా ఉండే వాడు.. ఎలా అయ్యాడు’, ‘విజయ్ దేవరకొండను గుర్తుపట్టడం కష్టమే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
Also Read: Hyper Aadi: వారంతా ఒక్కటే.. అల్లు అర్జున్‌ను ట్రోల్ చేయడం ఆపండి!
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వీడీ 12 తెరకెక్కుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో హీరో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్, వైజాగ్‌లలో ఎక్కువ భాగం జరిగింది. ప్రస్తుతం శ్రీలంకలో షూట్ జరుగుతోంది. విజయ్ ఇటీవలే అక్కడకు చేరుకున్నాడు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!