TDP: బిగ్ ట్విస్ట్.. 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: ఏపీలో ఎన్నికల టైమ్ దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈలోపు ఇప్పటికే 144 నియోజకవర్గాల్లో అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా.. తాజాగా 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తోంది. ఆయా సెగ్మెంట్ల సమీకరణల దృష్ట్యా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మార్పుల్లో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాడేరు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Kakarla Suresh: కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు
Also Read
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఖరారు చేసింది. అయితే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు టీడీపీలో చేరారు. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ టికెట్ బీజేపీకి ఇవ్వడంతో.. రఘురామకృష్ణంరాజుకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. దీనిలో భాగంగా రామరాజు స్థానంలో రఘురామకు ఉండి టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇవాళ రఘురామకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫామ్ అందజేయనున్నారు. అలాగే పాడేరు టికెట్‌ను కిల్లు వెంకట రమేష్ నాయుడుకు కేటాయించిన సంగతి తెలిసిందే. అక్కడ టీడీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో ఆయనకు సహకరించడంలేదు. ఆయనను మార్చాలని అధిష్టానంపై స్థానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పాడేరు టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది.
మడకశిర నుంచి సునీల్‌ను అభ్యర్థిగా గతంలో ప్రకటించారు. అయితే టీడీపీలో కీలక నేతగా ఉన్న ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజుకు మడకశిర టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఆయనకు బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వాలని భావించినప్పటికీ.. ఆ టికెట్‌ను మాజీ ఐఎఎస్ కృష్ణప్రసాద్‌కు కేటాయించడంతో ఎంఎస్ రాజును మడకశిర నుంచి పోటీకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వెంకటగిరి నుంచి కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మిసాయిప్రియకు టీడీపీ టికెట్ కేటాయించింది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్‌కుమార్ పోటీ చేస్తుండటంతో.. లక్ష్మిసాయిప్రియ స్థానంలో ఆమె తండ్రి కురుగుండ్ల రామకృష్ణను పోటీకి దింపాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు అన్నెపర్తి టికెట్‌పై క్లారిటీ రాకపోవడంతో దెందులూరు బీఫారంను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. బీఫారంను తీసుకునేందుకు రావద్దని చింతమనేనికి టీడీపీ అధిష్ఠానం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అటు అన్నెపర్తి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉంటారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?