టాలీవుడ్‌లో హిట్‌ల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే విడుదలైన బింబిసార, సీతారామం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి తెలుగు సినీ పరిశ్రమను మరోసారి సత్తా చాటాయి. అయితే.. తాజాగా విడుదలైన కార్తికేయ 2 సినిమా సైతం.. అద్భుతంగా ఉందంటూ.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. అయితే..ఎలాంటి హడావిడి లేకుండా సైలంట్‌గా వచ్చిన కార్తికేయ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూల్లు రాబడుతోంది. ఈ సినిమాల నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ పాత్రకు న్యాయం చేసింది. అయితే.. అంతేకాకుండా వైవా హర్ష, శ్రీనివాస్‌రెడ్డిలు పాత్రలు సైతం అందరిని అలరించాయి. అంతేకాకుండా.. మరో కీలక పాత్రలో బాలీవుడ్ అగ్ర నటుడు అనుపమ్ ఖేర్ నటించారు. అయితే.. మొదట నార్త్ లో 50 స్ర్కీన్‌లలో విడుదలైన ఈ చిత్ర ఇప్పుడు వెయ్యికి పైగా స్త్ర్కీన్‌లలో ప్రదర్శించబడుతోంది.
అంతేకాకుండా.. ఇప్పుడు హిందీలో సైతం విడుదలైన ప్రేక్షకుల ఆదారణ పొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు చందు మొండేటి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను కలిశారు. అయితే.. అమితాబ్ బచ్చన్‌ను కలిసిన ఫోటోను పంచుకుంటూ.. అమితాబ్ గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. బిగ్ బీకి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. కార్తికేయ-3 సినిమాపై కూడా దర్శకుడు చందు మొండేటి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కార్తికేయ-3 సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.