NTV Telugu Site icon

KTR: మరోసారి కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం.. విచారణకు పిలవనున్న ఏసీబీ

Ktr 3

Ktr 3

ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చిన కేటీఆర్… అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.. తన లాయర్లను లోపలకు అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెళ్లేముందు ఏసీబీ అధికారులకు కేటీఆర్ ఓ లేఖ ఇచ్చారు.

Read Also: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో ఆరు రోజుల ప్రత్యేకతలు ఇవే..?

ఆ లేఖలో.. ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఇప్పటికే కోర్టులో రిజర్వ్ ఉంది.. ఆ తీర్పు ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉంది.. ఉత్తర్వులు పెండింగ్ లో ఉన్నప్పటికీ విచారణకు రావాలని తనకు నోటీసు జారీ చేశారని తెలిపారు. కానీ నోటీసులో మాత్రం కేసుకు సంబంధించిన పత్రాలు.. అలాగే ఎలాంటి సమాచారం కావాలో తదితర వివరాలను ఇవ్వలేదని పేర్కొన్నారు. కాబట్టి హైకోర్టు రిజర్వులో ఉంచిన తీర్పు ప్రకటించేంత వరకు విచారణకు రాలేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Read Also: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?

ఇదిలా ఉంటే.. కేటీఆర్‌ని మరోసారి విచారణకు పిలవాలని ఏసీబీ నిర్ణయించింది. కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై లీగల్ టీంతో ఏసీబీ భేటీ అయింది. విచారణకు సహకరించాలని ఇప్పటికే హైకోర్టు చెప్పినందున మళ్లీ పిలవాలని ఏసీబీ నిర్ణయం తీసుకుంది. కేటీఆర్ లేఖ పై ఏసీబీ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆర్డర్‌లో ఉన్న కేటీఆర్ విచారణకు రాకపోవడం పై ఏసీబీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. కేటీఆర్ దర్యాప్తునకు సహకరించడం లేదన్న విషయాన్ని ఏసీబీ హైకోర్టు ముందు ప్రస్తావించనుంది. ఈ క్రమంలో.. తదుపరి లీగల్ చర్యలకు ఏసీబీ రంగం సిద్ధం చేసుకుంటుంది. కేటీఆర్‌కు మరోసారి నోటీస్ ఇచ్చేందుకు ఏసీబీ టీమ్ సిద్ధమవుతుంది.

Show comments