NTV Telugu Site icon

Pakistan: ఒక్క గెలుపు లేదు.. పాక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం

Pak Fans

Pak Fans

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో.. స్వదేశంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజయం సాధించనందుకు ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు బంగ్లాతో జరగాల్సిన మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకుందామనుకున్న పాకిస్తాన్‌కు.. ఈ మ్యాచ్ గెలిచే అదృష్టం లేదు. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో పాకిస్తాన్ ఒకటి కూడా గెలవకుండా ఇంటి బాట పట్టింది.

Read Also: Akshay Kumar: “చలో మహాకల్” పాటపై పూజారులు ఆగ్రహం.. అక్షయ్‌కుమార్ ఏమన్నారంటే?

పాకిస్తాన్.. న్యూజిలాండ్, ఇండియా చేతిలో ఓడిపోయి గ్రూప్ Aలో 1.087 నికర రన్ రేట్‌తో చివరి స్థానంలో నిలిచింది. టోర్నమెంట్ చరిత్రలో అట్టడుగు స్థానంలో నిలిచిన మొదటి ఆతిథ్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది. పాకిస్తాన్ జట్టు మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేత 60 పరుగుల తేడాతో ఓడింది. రెండవ మ్యాచ్‌లో భారత్‌తో.. పాకిస్తాన్ 241 పరుగులకు ఆలౌటై 42.3 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. డ్రాప్ క్యాచ్‌లు, తక్కువ స్కోరు కారణంగా పాకిస్తాన్ జట్టు విఫలమైంది.

Read Also: ICC: టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ పాకిస్తాన్‌కు ప్రైజ్ మనీ.. ఎంతంటే..?

ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టుపై వారి దేశ అభిమానులే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పేస్ బౌలర్లు నసీమ్ షా, షాహీన్ అఫ్రిది, హరిస్ రౌఫ్ అత్యధిక ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించారు. ఖుష్దిల్ షా మాత్రమే రెండు ఇన్నింగ్స్‌లలో 107 పరుగులు చేసి మంచి మార్కులు పొందాడు. మరోవైపు.. సీనియర్ ఆటగాళ్లు బాబర్ అజామ్, ఫఖర్ జమాన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు.