Site icon NTV Telugu

Chamala Kiran Kumar Reddy : కేంద్రం బీహార్‌కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదు

Chamala Kiran Kumar Reddy

Chamala Kiran Kumar Reddy

Chamala Kiran Kumar Reddy : పద్మ శ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్ లో లెవనెత్తుతా అని అన్నారు భువనగిరి ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కార్పొరేటర్ కాదు కేంద్ర మంత్రి అని గుర్తు పెట్టుకోవాలని, హరీష్ రావు ముందు కేసీఆర్ ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలన్నారు చామల కిరణ్ కుమార్. కేంద్రం బీహార్‌కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదని ఆయన మండిపడ్డారు. అందుకే బడ్జెట్ లో మొండి చేయి చూపిస్తున్నారని, ఈ సారి అయిన లోకసభలో విభజన హామీల గురించి బీజేపీ ఎంపీలు మాట్లాడాలన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. అంతేకాకుండా.. రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు డిల్లికి పోయాడో కేటిఆర్ ను అడిగితే వ్యంగ్యంగా చెప్తాడని, ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి మోడీని రాష్ట్రానికి పెద్దన్న లాగ ఉండమన్నారని, కాంగ్రెస్ లో 8మంది ఎంపీలు ఉన్నారన్నారు. తెలంగాణ ప్రజలు 8మంది బీజేపీ ఎంపిలను గెలిపించారని, మిమ్ముల్ని గెలిపించింది ఎందుకు అని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష్మణ్ రాజ్య సభ ఎంపీగా ఉండి ఆర్ఆర్ఆర్‌పై భువనగిరి పోయి ఫిర్యాదు చేయడం పై వాళ్ల వైఖరి అర్థం చేసుకోవచ్చన్నారు చామల కిరణ్ కుమార్. హైదరాబాద్ RRR కోసం కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారని, RRR హైదరాబాద్ లైఫ్ లైన్ దానికి 45వేల కోట్లు అవసరమన్నారు. రిజనల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో తో హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుందన్నారు.

Supreme Court: ట్రిపుల్ తలక్‌కు వ్యతిరేకంగా ఎన్ని కేసులు నమోదయ్యాయి? రిపోర్టు ఇవ్వండి..

అంతేకాకుండా..’పద్మ అవార్డుల విషయంలో బండి సంజయ్ బాధ్యత రహిత్యంగా మాట్లాడిండు.. కిషన్ రెడ్డి దావోస్ పర్యటన ను , కంపెనీలను నెగెటివ్ ప్రచారం చేస్తుండు.. నల్లగొండలో రైతులు ఎవ్వరు కేటీఆర్ ధర్నా ను పట్టించుకోలేదు.. మూసీ కోసం పార్లమెంట్ లో ఎంపీలందరం కొట్లాడాలి.. మహారాష్ట్ర కంటే మన రాష్ట్రం ఎక్కువగా కేంద్రానికి జీఎస్టీ పే చేస్తుంది. పది ఏండ్లు రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించడంలో బీఆర్ఎస్ విఫలమైంది.. హైదరాబాద్ లో గ్రీన్ పీల్డ్ హైవే ,డ్రై పోర్ట్ పెట్టబోతున్నాం.. పార్టీ ఏ అవకాశం ఇచ్చినా స్వీకరిస్తా’ అని చామల కిరణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Bandi Sanjay: కుంభమేళాలో తొక్కిసలాట జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది..

Exit mobile version