వెన్నెల కిశోర్…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో కమెడియన్ గా ఫుల్ ఫామ్‍లో ఉన్నారు వెన్నెల కిషోర్.తనదైన కామెడీ టైమింగ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.ప్రస్తుతం టాప్ కమెడియన్ గా టాలీవుడ్ లో చలామణి అవుతున్నారు వెన్నెల కిశోర్. వెన్నెల సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కమెడియన్ గా తనదైన కామెడీ తో కడుపుబ్బా నవ్వించారు. కమెడియన్ గానే కాకుండా దర్శకుడి గా, హీరోగా కూడా రాణించారు.ఇప్పుడు ఆయన హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నారు.. స్పై యాక్షన్ కామెడీ జోనర్‌లో ‘చారి 111’ అనే సినిమా ను చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా నేడు వచ్చింది. ఇందుకోసం చిత్ర యూనిట్ ఓ వీడియో ను రిలీజ్ చేసింది.
చారి 111 చిత్రంలో స్పై ఏజెంట్‍గా ప్రధాన పాత్రలో వెన్నెల కిశోర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రసాద రావుగా మురళీ శర్మ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే సంయుక్త విశ్వనాథన్, మహీగా ప్రియామాలిక్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ‘మళ్లీ మొదలైంది’ ఫేమ్ డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సిమోన్ కే కింగ్ సంగీతం అందిస్తున్నారు.స్పై ఏజెంట్ గా కన్‍ఫ్యూజ్ అవుతూ.. నవ్వించేలా ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుందని అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా అర్ధం అవుతుంది.. కామిక్‍లా ఉన్న ఈ అనౌన్స్‌మెంట్ వీడియోకు కమెడియన్ సత్య వాయిస్ ఓవర్ ను ఇచ్చారు. ‘చారి 111’ క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో వివరించారు. అలాగే కొన్ని పాత్రలను కూడా పరిచయం చేశారు.ఎప్పుడూ ప్రశాంతంగా ఓ సిటీలో ఓ ప్రమాదం వచ్చిందని, దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న వారికి దొరికింది మాత్రం ‘లక్ ఉండి టాలెంట్ లేని.. స్టైల్ ఉండి స్టఫ్ లేని ఒక ట్యూబ్ లైట్ గాడు’ అంటూ వెన్నెల కిశోర్ పాత్రను చిత్ర యూనిట్ పరిచయం చేసింది. మొత్తంగా ఈ అనౌన్స్‌మెంట్ వీడియో ఎంతో ఫన్నీగా, ఇంట్రెస్టింగ్‍గా ఉంది.