గణతంత్ర దినోత్సవ పరేడ్, బీటింగ్ రిట్రీట్ వేడుకలు, రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమాల దృష్ట్యా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను త్వరగా మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. జనవరి 23న నిర్వహించబోయే రిహార్సల్ కోసం సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్, వాయు భవన్, ఉద్యోగ్ భవన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు జనవరి 22 సాయంత్రం 6.30 గంటల నుండి 23వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు మూసివేయాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది.
Read Also: CM Revanth Reddy : ప్రపంచంలోని సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారం
ముందస్తుగా మూసివేయబడే ప్రభుత్వ కార్యాలయాల వివరణాత్మక జాబితాను సిబ్బంది మంత్రిత్వ శాఖ తన ఆర్డర్‌లో పేర్కొంది. ఆ జాబితాలో పేర్కొన్న ప్రభుత్వ కార్యాలయాలు గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం జనవరి 25వ తేదీ ఒంటి గంట నుండి జనవరి 26 మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతాయని ఆర్డర్లో పేర్కొంది. కాగా.. వాయు భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్, సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్, శాస్త్రి భవన్‌తో సహా జనవరి 26న ‘ఎట్ హోమ్’ కార్యక్రమం కోసం ఆ రోజు సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయనున్నారు.
Read Also: Gidugu Rudraraju: ఎల్లుండి పీసీసీ చీఫ్‌గా షర్మిలకు బాధ్యతలు.. కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు!
కాగా.. బీటింగ్ రిట్రీట్ వేడుక ప్రత్యేక ప్రదర్శన కోసం జనవరి 28న సాయంత్రం 4 గంటల నుండి 7:30 గంటల వరకు మూసివేయనున్నారు. అందులో సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్, పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌తో సహా కార్యాలయాలు ఉన్నాయని సిబ్బంది మంత్రిత్వ శాఖ పేర్కొంది.